పుట:Leakalu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చేదోడువాదోడుగా వుండాలని నా కోరిక. జీవితంలో యే వృత్తి స్వీకరించడమనే కదా నీప్రశ్న? నీకు సాహిత్యకృపే, తగినదని నాసలహా. నే ననుకుంటున్న సారస్వతకృషి ఏమౌతుందో చూడ నీయి; అదే కనక ఫలించి వ్యాపారంగా రూపొంది పంటముఖానికి వస్తే నువ్వూ నాతోపాటు వుందునుగాని; నా సహచరునిగానిన్ను నేను తీసుకుంటాను. అందాకా అక్కడనే అంటిపెట్టుకునివుండు, నా మిత్రులు శ్రీ గిడుగు రామమూర్తి పంతులు 'రిప్పన్సు హిందూహైస్కూలు'ను తమ మేనేజిమెంటులోనికి తీసుకోవాలని తలపోస్తునారు. ఆయనే కనక అది తీసుకుం లేు నీకందులో స్థానం లభించగలదని వాగ్దానం చేస్తున్నాను. రిప్పన్సు హైస్కూలును ఆధునిక పద్ధతులలో నిర్వహించి దానిఫలితం ఏమిటో చూడాలని రామమూర్తి పంతులు ఆశయం. అందువల్ల నీకు ఆ స్కూలులో పనిచేయడం చాలా ఆహ్లాదకరంగా వుంటుంది. విజయనగరంలో నువ్వుం పే మనం చేయలేని పనంటూ యేదీ వుండదని నానమ్మకం. స్కూళ్ళయిన స్పెక్టరూ సిండికేటుమెంబర్ల లోని మన దేశస్థులూ మనకు సహాయపడతారు. మనమంతట మనమే సహాయం చేసుకోగలమని నా అభిప్రాయం.

పి. యస్: చిలకమర్తి 'పారిజాతాపహరణం' వొక కాపీ పంపించు.

ఎక్క హిల్ హౌస్ ఉదక మండలం 21 మే 1908

ప్రియమైన సుబ్రహ్మణ్యం,

'పదములపట్టిక"ను పంపినందుకు నీకనేక ధన్యవాదాలు. మీన్నాగారు అమ్మగారు క్షేమంగా వున్నారని తెలుసుకొని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/80&oldid=153029" నుండి వెలికితీశారు