పుట:Leakalu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విమర్శకు అవసరమైన ఆలంకారిక పదస్వరూపం నీకు చక్కగా అవగతమయింది. ఈవిషయమై నీకు నేను బోధపరిచేది ఆఫ్టే వుండదనుకుంటాను. కన్యాశుల్కంమీద వొక సమీకు వ్రాయి * అది పదో వొక మద్రాసు దినపత్రికలో అచ్చుఅయ్యేటట్టు చూస్తాను. నాటకం వెలువడిన వెంటనే నీకుకొన్ని ప్రతులు పంపమని నా పుస్తకవిక్రేతలు మెస్సర్ వి. రామస్వామి శాస్త్రలు అండ్ కో, ఎస్ప్లనేడ్ కు వ్రాస్తాను. (ప్రొప్రయిటరు మిస్టర్ వి. వేంకటేశ్వర్లు మంచి సాహితీపరుడు; ఆయనతో నువ్వు తప్పక పరిచయం చేసుకోవాలి] కన్యాశుల్కము ప్రతులు అందగానే కొన్నిటిని స్నేహితులకు బహూకరిద్దువు గాని; మిగతా వాటిని స్థానికపుస్తకవిక్రేతల ద్వారా అమ్మించే ఏర్పాటుచేయగలవనుకుంటాను. "నీలగిరిపాటలు' కన్యాశుల్కము పీఠిక నిన్ననే నీకు పంపించాను. నువ్వుకనక సమీడించేటట్లయితే పాటల్ని దృష్టిలో పెట్టుకో. ఏమంటావా నాకు గ్రాంథికం వ్రాయడంచేతకాక కన్యాశుల్కం నాటకాన్ని వాడుక భాషలో వాశానని శ్రీ కొక్కొండ వేంకటరత్నంపంతులు కోవకు చెందిన పండితులు అంటే అనవచ్చును.

తెలుగు వ్యాకరణం వ్రాతామనుకున్నానా ఆరంభించిన పని ఆలాగునే నిద్రపోతూ వుంది. నేను చేయవలసినపని ఎంతైనా వుంది. ఆరోగ్యంమటుకు బాగుండడం లేదు. నువ్వు నాకు


  • "వారి ఆజ్ఞానుసారము కన్యాశుల్క-నాటకమునకు నీలగిరిపాట లకునుగూడ నేను 1909.1910 సంవత్సరములో విమర్శలు వ్రాసి యుంటిని. హిందూపత్రికలో ప్రచురణ అయ్యెనుగాని కాపీ యిప్పడు నా వద్దలేదు." శ్రీ సుబ్రహ్మణ్యంగారి వాక్యాలు. - Q
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/79&oldid=153028" నుండి వెలికితీశారు