పుట:Leakalu.pdf/82

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఉజ్జ్వల నైతికశక్తి కలది కాదు. వీరిలో ఎవరికీ మర్యాదా మప్పి తమూ వున్నట్లు కనిపించదు. కాని అవినీతిపరుడూ కుటిలుడూ అయిన ఫాల్ స్టాఫ్, షేక్స్పియర్ పద్ధతిహాస్యానికి శిఖరాగ్రం వలె ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. నాకు సమంగా జ్ఞాపక మున్నట్లయితే ఆట్వే అనే నాటకకర్త అనుకుంటాను, 'వెన్నిస్ ప్రిజర్వుడ'నే తన నాటకంలో విసిగెత్తించే వొక రంగాన్ని సృష్టించాడు. అందులో వొకానొక ఉన్నతప్రభుత్వో ద్యోగి అతినీచమైన వొక వంపుడుకత్తెముందు పరువు పోగొట్టు కుని తననుతానే నూణత పరుచుకుంటాడు.

వాస్తవిక రచన అనే దానిని కళానైపుణ్యంతో ఎంత ఆదర్శపూరితం చేసినప్పటికీ, విధిగా అది కొన్ని లకణాలను ప్రస్ఫుటికరింపక తప్పదు. వాస్తవిక రచనాపద్ధతికి నైతిక భావా లను గురించిన ఆ షేపణ కొంతవరకు వ్యక్తుల స్వభావాలనుబట్టి ఏర్పడుతుంది.

మీ పినతండ్రి కుమారుడు శ్రీ పట్టాభి రామమూర్తి సాంగత్య ఫలితంగా నీకు అవినీతి అంటే పరమ అసహ్యం. సాని పీల్ల నిన్ను షాక్ చేస్తుంది. నీతిపై నీకుగల సున్నితమైన అభి ప్రాయానికి నిన్ను నేను అభినందిస్తున్నాను. అందువల్ల యీ సమస్యను సాకల్యంగా నీతో నేను చర్చించదలచుకో లేదు. నువ్వు నీ వయస్సుకు మించిన జ్ఞానవంతుడివి.

కవితాన్యాయం నిన్న మొన్నటిలాగ నేడు లేదు. మానవ జీవితాన్ని నేను చిత్రిస్తాను. చిత్రిస్తూ కళా నైపుణ్యంతో ఆదర్శపూరితం చేస్తానే అనుక్తో, కవితా కళకు నేను వొదిగి వుండవలసిన వాడినే అయినా మానవ సమాజంపట్లనాకొక మహ

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/82&oldid=153031" నుండి వెలికితీశారు