పుట:Leakalu.pdf/76

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఎక్కహిల్ హౌస్ ఉదకమండలం * 7 మే 1909

ప్రియమెన ముని సుబ్రహ్మణ్యం,

నీభోగట్టాలేవీ నాకు తెలియడం లేదు. ఇన్నాళ్లూ ఎక్కడవున్నట్టు, నువ్వు ఏం చేస్తున్నట్టు ? తరుచు నేను నీకు ఉత్తరాలు రాయడంలేదంటే కారణం నాకు రాయాలని లేక కాదు; బొత్తిగా వోపికలేక.

'కన్యాశుల్కం' యిప్పటికి నూటయాభై రెండు పేజీలు అచ్చయింది, చిన్నతరాలలో ముద్రించినా రెండువందల పేజీలు


విషయాలపై వ్యాసాలను అచ్చువేయిస్తూ శ్రీ రామకృష్ణయ్యగారు ఈ పత్రికద్వారా యెన్నదగిన సాహిత్య సేవచేశారు. అముద్రిత ప్రాచీన గ్రంథాలను సేకరించి వాటిని యితరప్రతులతో తైపారువేసి దోషాలను సరిదిద్ది పరిష్కరించి అచ్చువేయడం "అముద్రితగ్రంథచింతామణి’ ఆశయం. పండితకవులు శ్రీ మండపాక పార్వతీశ్వరశాస్త్రి, వేదం వేంకటరాయశాస్ర ప్రభృతులు ఈ పత్రికలో తమ రచనలను ప్రకటిస్తూ వుండేవారు.

  • స్వత్పసిద్ధముగా మహాకవి అర్ఛకులు, శీతోష్టపరిస్థితుల ప్రభావా నికి ఆయన శరీరం ప్రతిచలిస్తూ వుండేది. సాధారణంగ్ వీచే గాలిసైతం ఆయనకు పడేదికాదు. గాలి వొంటికి తగలకుండా గొడుగును అడం పెటు కుంటూ పండేవారు. వొంట్లోని సత్తవ కూడబెట్టుకోవడంకోసమే వేసప్ కాలాల్లో విజయనగరం రాజకుటుంబీకులతో ఉదకమండలం వెళ్లేవారు. కొండుభట్టీయము మొదలైనవి ఆయన ఉదకమండలంలో వున్నప్పడు వ్రాశారు.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/76&oldid=153025" నుండి వెలికితీశారు