పుట:Leakalu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దాటేటట్టు వుంది. బిడియమనేది అడ్డువస్తున్నమాట నిజమే అయినా కన్యాశుల్కం గొప్పరచనగా రూపొందించానని నేను అనుకుంటున్నాను. నాటకం చదివి నాకు నేనే ముగ్ధుణ్ణయాను. అదే దీనికున్న గీటురాయి. మొదటికూర్పుకంటె రెండవకూర్పు నామనోభావాలను ఆలోచనలను సమగ్రంగా వ్యక్తం చేస్తున్నదే. తొలికూర్పు అలాగకాక, పై మెరుగులనే ప్రతిబింబించింది.

ఇంతవరకూ అచ్చయిన ఫారాలను నీకు పంపమని నా నాటకముద్రాపకులకు రాశాను. దయవుంచి జాగుర్తగా వాటిని చదువు, నీ స్నేహితులకు చదివి వినిపించు. నాటకంలో వొక "దానికొకటి అతకని విషయూలు అసంగతాలు ఏవైనావున్నట్లు నీకుతో స్తే, వాటిని వెంటనే నాదృష్టికి తీసుకురా. అందులో ఏయే మాండలిక పదాలు నెల్లూరుజిల్లా ప్రజలకు అర్ధంకావో ఆ పదాల దిగువను గీతగీసి గుర్తు పెట్టితివా, నాటకం చివర వాటి అర్థాలను వివరిస్తూ వొక పట్టిక చేరుస్తాను.

శ్రీ వేంకటరాయశాస్త్రిగారి 'ప్రతాపరుద్రీయము వంటి కొన్ని నాటకాలలో కవితా ఫ్రాడిమా కల్పనాచాతుర్యమూ లోపించకపోయినా ప్రస్తుతం తెలుగున వెలువడుతున్న నాట కాలన్నీ వొట్టి డొళ్ళసరుకులు. చివరకు ప్రతాపరుద్రీయంలో సైతం పేజీలకు పేజీలు ఎన్ని తిప్పినా అవి నాటకకథాగ


"విపరీతమైన బడలిక ఆయాసం నాకు బాల్యంనుంచీ వున్నదే. నాశరీరతత్వమే అంతఅనిపించేది. చాలా బక్కపల్చటి మనిషిని. కాని నేను కావించే కృషి మేధో సంబంధమైన కార్యాచరణా అత్యధికం. నేనింతకృషి ఎలాచేస్తున్నానా అని నామిత్రులకే కాదు, నాకే ఆశ్చర్యంగా వుండేది. ఎప్పడూ పక్కమీద అలావాలి విశ్రాంతి తీసుకోవాలనిపించేది" చూ. మహాకవి డైరీలు : పేజీ 260.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/77&oldid=153026" నుండి వెలికితీశారు