పుట:Leakalu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ పోతరాజు నరసింహం లేడూ, కాస్త శ్రద్ధతీసుకోమని છછે. నికి ఉత్తరం (వాశాను. కాని అతను జవాబు వ్రాయలేదు. తెలుగువ్యాకరణం వ్రాయడానికి ఉపక్రమించాను. నెల్లూరు జిల్లా వ్యావహారిక భాషా వ్యాకరణం నాకు అవసరం. నెల్లూరుజిల్లా "వాడుకభాషాపదాలు, ముఖ్యంగా క్రియలు, క్రియా భేదాలు విశేష్యములలోని రూపభేదాలు తెలిపే మౌక పట్టికను తయారుచేసి నాకు పంపించగలవూ? మహాభారతంలోని వ్యాకరణవిరుద్ధప్రయోగాలనుగురించి తిక్కనసోమయాజిని గురించి అచ్చయిన• 'అముద్రితగ్రంథ చింతామణి' సంచిక కాపీలు, నీకు దొరికినట్లయితే వాటినిపంపు. కీ.శే పూండ్ల రామకృష్ణయ్యగారు నాకు స్నేహితులు. తిక్కన వంశీకులను గురించి, కొట్టరువుగ్రామం మొదలైనవాటిని గురించి ఆయన వ్రాశారు. ఈసారి ఉత్తరంలో విపులంగా అన్నీ వ్రాస్తాను.

ప్రేమాభిమానాలతో,


  • 1885 వ సంవత్సరమున సుప్రసిద్ధపండితులు శ్రీ పూండ్ల రామ కృష్ణయ్యగారి సంపాదకత్వాన నెల్లూరులో ప్రారంభమయిన సాహిత్య మాసపత్రిక. శ్రీ ఒడయరు వీరనాగయ్యగారు మొదట శ్రీరామకృష్ణయ్య గారితో సహకరిస్తూ తామూ సంపాదకులుగా వుండిరి కాని తరవాత వారు విరమించారు. ఛందోవ్యాకరణాలంకారశాస్రవిచారణ, సమస్యాపూరణము, వసుచరిత్ర మనుచరిత్రాది ప్రాచీనకావ్యాలలోని కఠినపద్యాలకు ఆర్థ నిర్ణయ్ం, భిన్నప్రతులెలోవుడే పాఠాంతరములను పరిశీలించి కవి హృదయనిర్ధారణం, పూర్వవైయ్యాకరణులమతాన్ని అనుసరించి లక్షణవిరుద్ధమైన శబ్దసమాసాలకు ఆక్షేపణ, పూర్వపక సిద్ధాంతములు, నాడు వెలువడే కావ్యాలపై విమర్శనము, కవినిర్ణయములు ఇత్యాది
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/75&oldid=153024" నుండి వెలికితీశారు