పుట:Leakalu.pdf/74

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గలిగాను. నా వొంట్లో కులాసాగా వుందని ఆరోగ్యం చక్కగా వుందని దర్బారురాజకీయాలను దూర దూరంగా వుంచగలుగు తున్నానని తెలిస్తే నువ్వు ఆనందిస్తావుకదూ! కన్యాశుల్కంనాటకాన్ని చాలామటుకు మార్చివేశాను. మూడు అంకాలు పెస్సుకు వెళ్ళినతరవాత నాటకంలోని వొక పాత్రపట్ల నాకుగల దృక్పథాన్ని మార్చుకోవలసి వచ్చింది. నువ్వు మళ్ళీ మదరాసు వెళ్ళినపుడు రామస్వామి చెట్టిని కలుసుకుని నా నాటకం త్వరగా అచ్చు అయేటట్టు చూడమని చెప్ప. ఇప్పటికే అనుకోనంత ఆలస్యమయింది. మా మేనల్లుడు


కొన్ని పద్యకావ్యములు వచనగ్రంథములుగూడ నుండెడివి. ఈ గ్రంథము లన్నియు నేనుజదివి అందలి వంశములు వివరముగ వ్రాసి అందలి పద్య ములను ఇంగ్లీషుతర్జుమా జేయుటయు అవన్నియు అచ్చొత్తించుటయు నా పనిగ నిర్ణయింపబడెను. ఇదిగాక ఆంధ్రకవులు వ్రాసిన ప్రబంధకావ్య ములలోని ” ప్రథమాశ్వాసములలో కృతిపతియొక్కయు కృతికర్త యొక్కయు వంశావళులు దెలుపు పద్యములు దీసి అందుండు చారిత్రక విషయముల విడదీసి శిలాశాసనములలోని రాజుల మంత్రుల జీవితకాల ముల ఆధారమువల్ల ఆంధ్రకవుల, వారిపోషకుల కాలనిర్ణయము జేయ వలసియుండెను. అప్పారావుపంతులుగారు నాకు మార్గముజూపి పనులు ప్రారంభింపజేసి వదలివేసినంతనే నేనీపనులన్నియు కడుత్వరితముగ పూ_ర్తిచేయుచుంటిని, ఆయన నియమించిన పనులు రేయింబవళ్ల జేయు టకు నాకు యుత్సాహముగ నుండెను. ఈ విధముగ మేముజేసిన కాల నిర్ణయమునకును ఆప్పటికి ముందే శ్రీ కందుకూరి వీరేశలింగంపంతులు గారు వ్రాసియుండు కవులచరిత్రలోని కాలనిర్ణయమునకును గొంత భేద భావము లుండెను. ఆయనకు ఆంధ్రకవులచరిత్రను వ్రాసి ప్రచురించవలె నని ఆశయమైయుండెను."

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/74&oldid=153023" నుండి వెలికితీశారు