పుట:Leakalu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పెట్టాను. ఈనాటి తెలుగుశబ్దశాస్త్రపుస్థితిని బట్టి నేను ఈ గుర్తులతోనే తృప్తిపడవలసి వచ్చింది. అనునాసిక 'వ'ను సూచించడానికి 'వ' తరువాత అర్థానుస్వారాన్ని వాడాను. కొత్తసంజ్ఞలను కనిపెట్టి లిపిలో కల్పించుకోవడం వాడుక భాషలో గ్రంధరచన విస్తారంగా వ్యాప్తి చెందినపుడే సాధ్యపడుతుంది.

నేను సూచించిన లేఖన చిహ్నాల్ని సంతోషంతో పాటించి నాకు సంతృప్తి కలిగేటట్టు పుస్తకాన్ని చక్కగా ముద్రించిన మెస్సర్సు, జి. రామస్వామి చెట్టి అండ్ కంపెనీ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/45&oldid=153004" నుండి వెలికితీశారు