పుట:Leakalu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కవితా మంజరులు *

(కవుల పూఁదోఁటలఁ గట్టినవి)

శ్రీకృష్ణుఁడు ద్వారకలో నవతరించి యుండిన బంగారు కాలమున, నాపురియం దొక రూపగుణసంపద గల వేశ్యా రత్న ముండెను.

క. కల భాషిణియను పేరా
    వెలఁది మును వహించు సహజవిలసత్కలభా
    షలకుఁ దగఁ జాల దపు డది
    కలికితనముఁ జతురతయునుఁ గలపలుకులకున్.

క. తొలుఁవ్రాయపుమగకొదమల
   తలఁపులతమకములు మిగులఁ దను నెదురుకొనన్
   జలజాక్షి జవ్వనము గడు
   వెల సెఁ బ్రతిక్షణము వింత వింతగ నంతన్.

చ. బెళుకులఁ జిమ్ముచుం గలికిబ్చిత్తరిచూపు సరత్నకుండలాం
    చలకషణోజ్జ్వలత్వము పసల్ నెఱపన్ ఝుళిపించుచున్ భుజం
    గుల హృదయస్థలుల్ వొడిచి కొంచక తోడన పోటగండ్ల దూ
    ఱె లలన; యూర! యొక్కకతఱం బువుఁబోండ్లు కటారికత్తియల్.


  • ఉత్తమ ప్రాచీన ఆంధ్రకావ్యాలలోని రసవత్తరఘట్లములను కూభాగములను కవితామంజరులనే పేరుతో సంతరించాలని గురజాడ సంకల్పించినట్లు తోస్తున్నది. ఈ సంకల్పముతో వారు ఎంచుబడిచేసిన ప్రథమపుష్పము పింగళి సూరనార్యుని "కళాపూర్ణోదయము". అందులో మూడాశ్వాసముల కథాభాగాని కిది క్లుప్తీకరణ.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/46&oldid=153005" నుండి వెలికితీశారు