పుట:Leakalu.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జీవద్భాష. ఇది "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టు," ఈ జీవద్భాషలో మన సుఖాల్నీ దుఃఖాల్నీ వెల్లడించుకోడానికి మనం ఎవరమూ సిగ్గుపడడంలేదు కాని, దీన్ని వ్రాయడానికి మాత్రం మనలో కొంతమంది బిడయపడుతున్నారు. వ్యావహారిక భాషలోవున్న సాహిత్యం రైతును మేల్కొల్పుతుంది. భారత దేశంలోవున్న ఆంగ్లేయుడి గుండెను కదుపుతుంది. దాని శక్తి అపారం; అవకాశాలు అనంతం.

ఆంగ్లమాండలికాల ప్రాకృతభాషల చరిత్ర తెలిసిన వాళ్ళకివాడుక భాషలోవున్న సాహిత్య ప్రాశస్త్యాన్ని ఆవశ్యకతను ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఇంతకీ నూత్న కావ్య భాషను రూపొందించేవి వాదప్రతివాదాలు కావని నాకు తెలు సును. నూత్న కావ్యభాషను ఒక మహారచయిత వ్రాయాలి; తయారు చేయూలి; అందుకు మనం అతనికి అనుకూల పరిస్థితిల్ని వాతావరణాన్ని కలిగిద్దాం.

ఈ మధ్య మద్రాసు హైకోర్టు తీర్పువల్ల సాంఘిక సంస్కరణోద్యమానికి గొప్ప బలం వచ్చింది. ప్రధాన న్యాయ మూర్తి సర్, ఆర్నాల్డు వైటు, న్యాయమూర్తులు మిల్లర్, మన్రోలు ఈ విధంగా తీర్పు యిచ్చారు: “ఒక పిల్లను వివాహం చేసుకుందుకు తండ్రికి డబ్బు చెల్లించే వొప్పదం, నీతి బాహ్యం; ఇండియన్ కాంట్రాక్టు ఆక్టు 28 న సెక్షన్ ప్రకారం, చట్ట విరుద్ధం."

ఈ పుస్తకాన్ని అచ్చు వేయించేటపుడు నన్నొక జటిల ప్రశ్న ఎదుర్కొంది. వాడుక భాషలోవున్న ఎన్నో శబ్దోచ్చారణలు తెలుగు అక్షరమాలలో కనిపించవు. అలాంటి ఉచ్చారణ ధ్వనుల్ని సూచించడానికి సమీప అక్షరాలమీద వొక నిలువుగీత

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/44&oldid=153003" నుండి వెలికితీశారు