పుట:Leakalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అజ్ఞానంవలన కలిగే మహదానందం అటువంటిది. కృత్రిమ యుద్ధాలుసామగరడీలు దుష్టసంగీతం కామ పేరేపక నృత్యాలు ఆడంబర వేషధారణాది అసహ్యరంగాకర్షణలకు కన్యాశుల్కంలో తెనాణెలేదా అయినా అది అవారపేతక సమూహాలను ఆకట్టుకొంది. వ్ర్యావహారిక భాషకువున్న అర్హతను హక్కులను రుజువు పరిచింది.

తెలుగుదేశంలో హిందీ నాటకప్రదర్శనలు పతనమౌతున్నందుకు నాకు సంతోషంగా వుంది. అలా అని తెలుగు నాటకరంగస్థితిని చూసి మనం సంతృప్తి పడలేం. నామార్హ మైన నాటకమందిరాలేవీ మనకు లేవు, నటనను కళగా సాధన చేసే వృత్తినటులు శూన్యం. పోనీ మంచినాటకాలయినా మనకు ఆఫ్రే కనిపించవు, కేవలం వినోదసాఫల్యంకోసం తప్ప అతిసంకీర్ణ సాంఘిక పరిస్థితులతో సంఘటితమైవున్న ఆధునిక జీవితాన్ని నాటకరచయితలెవరూ స్పృశించక కేవలం నిర్ల త్యం చేస్తున్నారు. శృంగారఘట్టాలనే విసుగుపుట్టే పర్యంతం మనరచయితలు అల్లుకుపోతున్నారు. రచయితల స్వతంత్ర కల్పనాశక్తి విహీనతకు భావదారిద్ర్యానికి ఇంతకం ఓ వేరే నిదర్శనం అక్కరలేదు. అంతో యింతో రచనాశిల్పపరిజ్ఞా నాన్ని ప్రదర్శించగల రచయితలు కొద్దిమంది, విశ్వవిద్యాలయ విద్య పాశ్చాత్యసంస్కృతి, ప్రాబల్యంవహించిన ఏబైయేళ్ళకు సాహిత్య రచనా నైపుణ్యం ఇంత అధమస్థాయికి దిగజారిపోయిందీ అంటే, నిజంగా ఆశ్చర్యం కాదా! ఇందుకు హేతువు మన కళాశాలల్లో సాగుతున్న లోపభూయిష్ట ఆంగ్ల సాహిత్య బోధనా పద్ధతులేనని చెప్పవలసి వుంటుంది. వాడుక భాషలను వికసింపచేయడమే తమ ప్రధాన బాధ్యతగా, ఆంగ్ల

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/40&oldid=152999" నుండి వెలికితీశారు