పుట:Leakalu.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చింది. నాటకాన్ని రెండవసారి అచ్చువేయించే బెడదను ఇవాళ కాదు రేపు అని చాలాకాలం తప్పించుకుంటూ వచ్చాను. కానైతే నా మిత్రుల పట్టుదలవల్ల ఇప్పడు మళ్ళీ అచ్చువేయక తప్పిందికాదు.

తెలుగుదేశంలో గ్రంథికర్త అనేవాడు సాధారణంగా తన పుస్తకానికి తానే ప్రచురణకర్త విక్రేత. పుస్తకాలను అమ్మి పెట్టే ఆదరవు దేశంలో మృగ్యం, పుస్తక వ్యాపారం నిరుత్సా హకరం. పాఠకులు స్వల్పం. దేశంలో ఈపాటి పుస్తక పఠనమైనా సాగుతున్నదంటే దానికి కారణం కేవలం బోర్డాఫ్ స్టడీస్ పడు తున్న మహాశ్రమ. పరమపూజ్యమయిన ఈసంస్థ తలఎత్తడంతోనే క్రైస్తవ ధర్మసూత్రాలు "నువ్వు చదవాలి" అనే తమ పద కొండవ సుభాషితాన్ని బోధించడం మానుకున్నాయి, కాని "నువ్వ చదవాలి" అనే ఆ సూక్తిని వొక విధిగా శాసించే హక్కు ఈ సంస్థకు సంక్రమించింది. దానితో మానవమాత్రు డెవడూ చదివి ఆనందించలేని కొరగాని పాఠ్యగ్రంథాలను వేలాది యువకులు విధిగా చదువుకుంటున్నారు. పాపం, దురదృష్టవంతులు!

మొదట నే నీ నాటకాన్ని ప్రచురించాలని వ్రాయలేదు. సాంఘికాణాస్కరణోద్యమాన్ని పురోగమింపచేయడానికి నాటక రంగానికి తెలుగుభాష నప్పదనే సామాన్య దురభిప్రాయాన్ని పోగొట్టడానికి దీన్ని_స్తేస్తు_మ్రో ఆ మధ్య మహారాష్ట్రసంచారక నాటక సమాజాలు తెలుగు జిల్లాలలో హిందీ నాటకాలను ప్రదర్శించాయి, డబ్బుచేసుకున్నాయి, స్థానిక సమాజాలు వాటిని మక్కీకి మక్కీ అనుకరించాయి; ప్రేతకులుతమకర్థం కానిదాన్ని వింటూ పరమానందభరితులయారు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/39&oldid=152998" నుండి వెలికితీశారు