పుట:Leakalu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవకూర్పు పీఠిక

కన్యాశుల్కం నాటకాన్ని కొద్ది మార్పులతో పునర్ముద్రించాలని మొదట అనుకున్నాను; కాని నా మిత్రులు శ్రీ యస్. శ్రీనివాసఅయ్యంగారిసూచనవల్ల దాన్ని పూ_ర్తిగా మార్చి తిరిగి పోతపోశాను. మరి ఆయన కావించే సాహిత్య నిర్ధారణలపట్ల నా కమిత గౌరవం. ఈ విధంగా రూపుదిద్దడంతో దీనీ పరిమాణం తగినంత పెరిగింది. ప్రస్తుత రూపంలో వున్న ఈ నాటకం యించుమించు సరికొత్తది.

కన్యాశుల్కం తొలికూర్పుకు చెప్పకోతగ్గ విజయం లభించింది. పత్రికలు మనఃపూర్వకంగా స్వీకరించాయి; తెలుగు సాహిత్య చరిత్రలో దీనినొక సంఘటనగా పేర్కొని ప్రశంసిం చాయి. స్త్రీలు, పురుషులు, పిల్లలు నాటకాన్ని ఉత్సుకతతో పఠించారు, అయితే దీనిని ఆమోదించనివారు వొక్కరే వొక్కరు; వారుసాంఘిక సంస్కరణ, వ్యావహారిక భాషా తప్పితే, మిగిలిన ప్రపంచమంతా బహుచక్కగా సవ్యంగా వుందనుకొనే మహామహోపాధ్యాయ కొక్కొండ వేంకటరత్నంపంతులుగారు. ఈ రెండింటినీ ఆయన సహింప నొల్లరు. మొదటికూర్పు నాటకం అచ్చయిన కొన్ని వారాలలోనే ప్రతులన్నీ అయిపోయాయి, నాటినుంచి ప్రతులు కావాలనే కోరిక నిరంతరం అధికమౌతూ


• రచనా కాలం : 1 మే 1909; స్థలం: ఉదకమండలం.

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/38&oldid=152997" నుండి వెలికితీశారు