పుట:Leakalu.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గొప్పవాడనుకుంది. ఆయన చెప్పిన మూటలు నిజమును (8%ס ח కుంది, పునర్వివాహము దోషము కాదని నమ్మినది. అందుకు లోబడ్డది. మీనాకి బాల వితంతువే. కాని మధురవాణివలె వేశ్యాంగన కాదు. బుచ్చమ్మవలె సద్గతి విచారించునదియు కాదు. తన యింటనే యుండి రహస్యముగా పడుచు పొగరును డెంచు కొనజూచు దుశ్ళీల. ఈ మూడు రకాల స్త్రీ స్వభావాలను యీనాటకంలో కూర్చినాడు. పట్నాల్లోను, పల్లెల్లోను వుండే విపరీత این ایا పురుష స్వభావాలను, రెండుమూడు కథా వ్యూహములను వొక్క కుదురున జేర్చి, దేనికది చక్కగా విప్పారి, నిజప్రవృత్తినగుపరచి రసపుష్టితో రాజిల్లునట్లుగ, నతికించగలశక్తి అప్పారావుకే చెల్లి నది మరియొకరైతే కథాంశానికి యేదో భక్తిజ్ఞాన వైరాగ్య మేర్పరచి నీతి బోధకుగడంగియుందురు. గిరీశం చేత డామిట్ అనిపించుటలోనేయప్పరాయనియసాధారణప్రతిభా సామ్రాజ మగుపడుచున్నది. తివాచులలో రేఖా సంస్ఫూర్తి గలచిత్ర్య విన్యాసముల కన్న యంచులోనుండి సగము ముప్పాతిక రూపములతో నగుపడుచు మరల నటులనే యావలి కొనయందు నిప్ర్కమించు పూలపొల్లైములు యొక్కువ యందగించునట్లుగా, కన్యాశుల్కంలో చూపబడ్డ గిరీశచరిత్ర అదివరకు లెక్కకు మించి జరిగిన సాహసాలలో యిది యొకటి యనియు, దీని భంగపాటుతో చిత్తవై కల్యమొందక, రణవీరుని పగిది మరి యొు పోరుమ్ర* తొల్లి చేజారిన విజయఫలమును పొందెదనను అహంకారమును సూచించుటయే మిక్కిలి నేర్పుగా తోచు చున్నది. సుగుణములు, దుర్గుణములు, సత్ర్పయత్నములు, &ט סכ చారములు అనంశపారంపర్యలో వచ్చుచుండును. కాని

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/34&oldid=152993" నుండి వెలికితీశారు