పుట:Leakalu.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అన్నమాట మహా బాగుంది.' అనే సమ్మోహన వాగ్బాణ ప్రయోగ సామర్ధ్యమెరిగి వర్తించెను, గిరీశము,అగ్నిహోత్రావ ధానులు తన వ్యాజ్యాలలో గిరీశము తోడ్పాటు నాశించి యుండెను కొడుకు చదువును కుండలలో గుర్రాల తోలే వాడైనా, కోర్టు వ్యవహారాలలో మాత్రము వెనుక తీయడు. అక్కడకూడా వీలైతే చవకగా మంచి ప్లీడరును కొట్టెయ్యా లని ఆశపడతాడు: పల్లెటి వైదికులలో అగ్నిహోత్రావధాను ෆයි వొక విధమైన ప్రకృతి. లుబ్ధావధానులదింకొకటి. నలత మనిషి. డబ్బుకు గింజులాడే స్వభావరి. యెంతవరకూ చేతిపైసా వదలకుండా మంచి లాభం వెతుకుచూ కొద్ది కర్చులో బంగరు మేల్బంతిని కట్టికొన చూచువాడు. వీరిద్దరు యెవరిదారిలో వారు చాదస్తులే పల్లెటి బ్రాహ్మణుల తృతీయప్రకృతి కరకట శాస్త్రియందు మూర్తిభవించియున్నది. ఇతను తగిన గడుగ్గాయి. మంచి లౌక్యుడు. యుక్తాయుక్తము మంచిచెడ్డలు లాభనష్టాలు తెలిసినవాడు, శిష్యులుండుటచేత చదువుకున్నవా డని యూహింపవచ్చును. ప్రాయశః కావ్యనాటకవిలాసపరిజ్ఞాత ఇవి వుంటూ సమయానుకూలమగు కార్యసాధన గలయజాచిన వాడు, బహుశా చీట్లాడగలడు, వేశ్యాప్రసంగంలో ఆరితేరిన తెరువరి. ఈ మూడు స్వభావాలు వెంకటేశంతోసహా పల్లెటి జీవుల వయః ప్రకృతి భేదములను చూపుతున్నది.

ఇక ఆడవేషాలలో మధురవాణి పణ్యవనితా విచిత్ర వైఖరుల గరచిన మేటిసాని; కాని యీమెలోకూడ కొంత మంచితనము, స్వజాతి విరుద్ధమైన విశ్వాసము, చివరకైనా పడుపుబ్రతుకుల బేలతనము గుర్తించి బుద్ధి మరలించుకొను ఆత్మశక్తియు గోచరించును. బుచ్చమ్మ ముగ్ధలలో ముగ్ధ. గిరీశం

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/33&oldid=152992" నుండి వెలికితీశారు