పుట:Leakalu.pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చప్పన మొలకెత్తి చివాలున వాడిపోవు. పురెకు పుట్టిన బుద్ధి పుడకలతోగాని అంతరించదు.

తెనాలి రామవిలాస సభ వారు బందరులో యీ నాట కాన్ని ముచ్చటమీర నాడి చూపారు. ప్రదర్శనంలో కన్యా శుల్కపు యసామాన్య ప్రదర్శనౌచిత్యము బయట పడినది. ఇందులో నా మద్దింపుమీద రామప్పపంతులై అభినయించిన తంగిరాల ఆంజనేయులుగారికి ఫస్టుమార్కులు చేరుచున్నవి. తరువాత స్థానం నరసింహారావుగారి మధురవాణిన్ని కరకట శాస్తుర్లయిన పులిపాక వెంకటేశ్వర్లుగారున్నూ మన్నింప దగిరి. బుచ్చమ్మ, మీనాడి వేసిన జక్కుల కుర్రవాడు, అగ్ని హోత్రావధానులు, వెంక శ్చేశము కూడ మొదటి తరగతిలో ప్యాసు అయినవారే. డాక్టరు గోవిందరాజుల సుబ్బారావుగారి నటన విషయమై చెప్పవలసిన ముచ్చట కాదు. గిరీళపు వ్యవ హారాలన్నిటిని మిక్కిలి చక్కగా నిర్వ_ర్తించారు, కాని వేషంలో బిడ్డల తండ్రివలె గృహస్తోద్యోగివలె కనుపించెను. గాని గిరీశము యొక్క యి రెస్పాన్సి బిలిటీ, పలుగాకితనము, షోకు డంబములు, చూపించే యిరువది రెండు, యిరువది మూడేండ్ల ప్రాయాన్ని సుబ్బారావుగారు చూప లేకపోయిరి, అనగా వేష సౌష్టవము, పాత్రాచిత్యము కొరవడినవి.

సుబ్బారావుగారి వొద్దికలు కొన్ని శారదలో కన్నులు గట్టినవి. మొదటిరాకడ - బెత్తం ఆడించుకొంటూ, చుట్టపొగ దులుసుకుంటూ; 'మిక యీ వూరులోవుంటే ఆబోరుదక్కేటట్టు లేదు' అని ఆలోచిస్తూ, జేరవచ్చినయునికి అప్పడే ఓడదిగివచ్చిన హాఫ్ యింగ్లీషుయైర్ వెళ్ళబోస్తూ వుండింది. తరువాత "యేమోయ్ మైడియర్ షేక్స్పియర్ మొహం వేళ్లాడేసావ్”

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/35&oldid=152994" నుండి వెలికితీశారు