పుట:Leakalu.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కందకుండా తప్పించుకొని, యింత పెద్ద ప్రైవేటు పంతులుకూ దబాలున డుంకీయిచ్చి దొబ్బే శాడు. (విశాఖపురి పాంత పరి భాష వాడినందుకు చదువరులు మన్నించెదరు గాక)

తుదకు సౌజన్యరావుగారు వొక విధంగా గిరీశం యొక్క దేశాభిమాన సంఘసంస్కరణ మిధ్యాడంబరమునకు సౌశీల్య విరాజితంబగు వెన్ను పట్టిగ వర్ణించుచున్నాడు. మధురవాణి కూడ గిరీశము యొక్క దుశ్ళీల దుర్విదగ్ధ మానస మౌఢ్యమునకు జీవితానుభవములలో మంచిచెడ్డలు తెలిసికొని బుద్ధి తెచ్చుకునే సుస్వభావాన్ని చూపుతున్నది. బుచ్చమ్మను లేవదీయు ప్రయత్నము భంగమైనాక "డామిట్ కథ అడ్డంగా తిరిగింది" అని చివాలున సౌజన్యరావు చెంతనుండి మరలిపోవునేకాని బుద్ధిని త్రిప్పకొను దారు లరయడు. రామప్పపంతులు, వెంకటేశము, సౌజన్యారావు, మధురవాణి, యీ నలుగురు గిరీశము స్వభావాన్ని అట్టి తెరవులలో భేదంగా సంచరించే వివిధప్రవృత్తులను చూపడానికి కల్పించబడ్డకూడలి.

అగ్నిహోత్రావధానులు వ్యాజ్యాలకోరు. రేయింబగళ్లు ప్రక్కయింటివాని పెడకప్ప పీకించ నుంకించుచుండును. కడు లోభి, ఆచారపరాయణుడు, వీరేశలింగంపంతులుగారి రాజశేఖర చరిత్రలో భోజనపు సమయానికి యవతరించిన సోమయాజుల వంటివాడు. దర్భాసనపుకట్టతో, దేవతార్చనమూటతో, మూడు కోర్టులూ తిరిగివచ్చే లౌకిక వైదిక మర్యాదా సమన్వేత, శుద్ధ లోభి. కూతులనమ్మకొని సొమ్ముచేసెడి పంద, గిరీశానికి ఆవు, గేదె పెరుగులతో శలవరోజులన్నీ విందుసేయడానికి వొప్పకోకపోయేవాడే. కాని గిరీశం మోహనాస్త్రమంటే యేమిటో తెలిసినవాడు. పాలిటిక్సులో మెదిగిన చెయ్యి 'నీవు

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/32&oldid=152991" నుండి వెలికితీశారు