పుట:Leakalu.pdf/31

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంత నిర్ధూమధాముడు గడుసుబొంద అగ్నిహోతావధానుల కడుపున పుట్టిందే మహాచిత్రము.

తెలివితేటలలో వెంకటేశాన్ని వెనుక పీటికగా చూపినట్లే, పోకిరితనంలో మరియొకరకపు పాత్రని గిరీశానికి భిన్నంగా నిలువ పెట్టాడు. రామప్పపంతులు నియోగి; -కా-దా? వ్యాపారి. గిరీశం వైదికపు వాళ్ళల్లోతప్పబుట్టినవాడు, రామప్ప పంతులు ప్రైవేటు వృత్తిలో సంపాదించుకొంటూ తన లౌకిక ప్రభావానికి, తన పంతులు వేషానికి, తన సంపాదనకు వొక చంప నెర వారుచున్న మీసపుటందముకు, తన వలపుపోకులకు, పొంగిపడుతూ తనయంతటి రసికుడు, వ్యవహర్త, రూపసి, లేడను భావముతో సంచరించు వాడు. నాల్లింగ్లీషు ముక్కలు రాకపోయి నయిగాని ఆ గిరీశం వెధవని తలయెత్తనిచ్చేవాణ్ణా అని మధురవాణి దగ్గర ప్రతాపాలు తెగనరకిన కోతగాడు. బుద్ధి లోనేకాదు. యెత్తుల పోటీయందునే కాదు. బలపరాక్రమాల్లో కూడ ధైర్యసాహసాల్లోకూడ నసహాయశూరుడని పొక్కి పొరలెడి చవిటి బుద్ధి, గిరీశం కనిపిస్తే పిల కెక్కతీస్తాననే మేటి బంటు. అతడు యేమరుపాటున ప్రవేశించగానే యీ మాటలు వాడి చెవిన పడలేదు గదా, అని తత్తరపడుచు మంచం క్రింద శరణు జొచ్చెను. రామప్పపంతులు తనరూపసంపదల ప్రభావముల విశ్వసించి, వెలయాలి చేతలను తీరుగా గుర్తింపనేరక, డబ్బు తగలేసుకుంటూ, తావలచినది తనను గూడ వలచునను భ్రాంతిలో దేలు వాడు. ఒక్క చిటికెలో కరకటశాస్త్రీ రామప్ప పంతు లెదుట నే మధురవాణికి కన్ను గీటి, వంచక నటుని యీడు తెగిన కోమలాంగిగ జరిపి, కంటిలో మన్నుపోసి, లుబ్ధావధాను లిచ్చిన కన్యాశుల్కంలో చిల్లిగవ్వైనా పంతుల

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Leakalu.pdf/31&oldid=152990" నుండి వెలికితీశారు