పుట:Lanka-Vijayamu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

లంకావిజయము


రాఘవ.

వెలయన్ = ప్రకాశించునట్లు, మనన్ = మన్నెడుకొఱకు, పాయసమున్, లలి=మిక్కిలి, సాము = సగము, ఆదిప్రియకు = మొదటిభార్యకు (కౌసల్యకు), అర = సగము, లలితా. . . నందనకున్ - లలిత = ఒప్పుచుండు, ఆమ్నాయోక్తుల = సంప్రదాయవాక్యములుగల “ఆమ్నాయస్సంప్రదాయః" అమరము. కేకయనందనకు = కైకకు, ఇంపలరు, రసజ్ఞకు = జిహ్వకు, అమృతంబునట్టు లొసంగెన్.


తా.

పెద్దభార్యకును, గైకకును, జిహ్వ కమృతమువంటి రుచిగలపాయసముం బెట్టెను.


లక్ష్మణ.

మనంబు = మనస్సు, వెలయన్, ఆయసమున్ = ఆసమానుఁడు లేని విష్ణుమూర్తిని, లలిన్, సామాది... క్తులకు - సామాది = సామవేదము మొదలగు, ప్రియకర = ప్రియముం గావించు, లలిత = మనోహరము లైన, ఆమ్నాయోక్తులకు = శ్రుతివాక్యములకు, ఏక యనన్ = ముఖ్యమైనది యనునట్లుగ, తనకు ఇంపలరురసజ్ఞకు, అమృతంబునట్టులొసంగు (స్తుతిచేసెననుట.)


తా.

సంతసముచే నాయసమానుఁ డైనవిష్ణుదేవుని సామాదివేదోక్తులచే తననోటి కమృతప్రాయమైన స్తోత్రము గావించెను.


వ.

అ ట్లొసంగి యంతలోన మఱియొకతలంపు పుట్టుటయుఁ ద
దభిముఖుండై యిట్లనియె.

24


అర్థము రెంటికిని స్పష్టము.


మ.

నలి దేవు ల్ముగు రేకమైన మిము నానందంబుగాఁ జూడ నేఁ
దలఁతుం గావున గోతులారహితతం దద్దివ్యసద్భక్తరా
సులలోనం దగనుంచిసాములు బుధస్తుత్యస్థితు ల్మీరు వే
డ్కల మీఱంగ సుమిత్ర భద్రపద మెక్కం జేయు టర్హంబగున్.

25


రాఘవ.

నలి = మిక్కిలి, దేవు ల్ముగురు = భార్యలు ముగ్గురును, ఏకమైనన్ = భేదభావము లేక యుండిరేని, మిమున్, ఆనందంబుగాఁ జూడ నేఁ దలఁతున్