పుట:Lanka-Vijayamu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

35

ప్రథమాశ్వాసము


గావున, గోతులార = ఓ స్త్రీలారా! హితతన్ = ఇష్టముచేత, తద్ది... లోనన్ - తత్ = =ఆ, దివ్య = దేవతాసంబంధమైన, సద్భక్తరాసులలోనన్ = శ్రేష్ఠమైన పరమాన్నపుముద్దలలో, సాములు = సగములు, తగనుంచి, బుధస్తుత్యస్థితుల్ = పండితులు స్తుతింపఁదగిన స్థితులుగల, మీరు, వేడ్కల, మీఱంగ, భద్రపద = శుభములకు స్థాన మైన, సుమిత్ర = సుమిత్రాదేవిని, మెక్కంజేయుట = భక్షించునటుల చేయుట, అర్హంబగున్ = తగును.


తా.

నాభార్యలైనమీరు ముగ్గురు నొక్కటిగా మెలఁగుట నా కెంతయు నిష్టము కావున, మీకు నే నిచ్చిన పాయనములోని సగము సగము భాగములు సుమిత్రకుఁ గూడఁ బెట్టుఁ డని దశరథుఁడు కౌసల్యను గైకను గోరెను.


లక్ష్మణ.

నలి, దేవు ల్ముగు రేకమైన మిమున్ = త్రిమూర్త్యాత్మకమైన మిమ్మును, ఆనందంబుగాఁ జూడ నేఁ దలతున్, గో = భూమియందు, తులారహితతన్ = సామ్యము లేనట్టుగా, తద్దివ్యసద్భక్తిరాసులలో = ప్రసిద్ధమైన భక్తసముదాయమునందు, నన్ = నన్ను, తగనుంచి, సాములు = స్వాములు, బుధస్తుత్యస్థితుల్ మీరు, సుమిత్రభద్రపదము - సు = శ్రేష్ట మైన, మిత్ = సూర్యునియొక్క, భద్రపదము = శుభస్థానమును, ఎక్కంజేయుట = ఎక్కునట్లు గావించుట, అర్హంబగున్.


తా.

త్రిమూర్త్యాత్మక మైనమిమ్ము నేఁ జూడఁ గోరెదను. ఈభూలోకమున ననుపమాను లైననీభక్తకోటిలో నన్నుఁ గూడ నొకనిగ జేర్చుకొని స్వామివారలు నన్ను సూర్యపదప్రాప్తుని చేయవలెను. అని గోపాలుఁడు స్తుతించెను.


గీ.

అనుచుఁ బల్కి యాతఁ డపుడే తదనుమతి
మిళితవాంఛితోక్తికలితుఁ డగుచు
వసతి సనుపమానపాయసరససుఖా
నుభవదారయుతత శుభత దాల్చె.

26


రాఘవ.

అనుచుఁ బల్కి, అతఁడు = ఆదశరథుఁడు, అపుడే, తదను....డగుచున్ - తదనుమతిమిళిత = ఆయిద్దఱుభార్యలయిష్టముతో మిళితమైన, వాంఛి