పుట:Lanka-Vijayamu.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

33

ప్రథమాశ్వాసము


తా.

పాపపరిహారమునకై యమృతస్వరూపుఁడవైన, మేఘవర్ణముగల కాంతియుతుని నిన్ను నా కోర్కులు ఫలించునిమిత్తమై నన్ను సేవించనిమ్ము.


గీ.

అనుచుఁ బలికి యాతం డక్షిగోచరుఁడుగా
కుంటఁ దెలిసి యజకులోద్వహుండు
గురుతరప్రతిభుఁడు గోపాలుఁ డిప్పుడు
వేడ్కతోడ నొక్కవెరవు వట్టి.

12


రాఘవ.

అనుచున్, పలికి, ఆతఁడు = ఆదివ్యపురుషుఁడు, అక్షిగోచరుండు, కాకుంట = కనఁబడకపోవుటను, తెలిసి = తెలిసికొని(అంతర్ధానమగుటఁ గనిపెట్టి), గురుతరప్రతిభుఁడు = గొప్పదైన ప్రభావముగలిగిన, గోపాలుఁడు = జనపతియగు, అజకులోద్వహుండు = దశరథుఁడు, అప్పుడు, వేడ్కతోడన్, ఒక్కవెరవు = ఒకయుపాయమును, పట్టి.


తా.

ఇట్లని చెప్పి యాదివ్యపురుషుఁ డంతర్ధానము నొందిన, దశరథుండు సంతోషముతో.


లక్ష్మణ

అనుచునా, పలికి, ఆతఁడు = ఆనారాయణమూర్తి, అక్షిగోచరుఁడు గాకుంటఁ దెలిసి, గురుతరప్రతిభుఁడు, అజకులోద్వహుఁడు = బ్రాహ్మణుఁడు, గోపాలుఁడు=గోపాలమంత్రి, అపుడు, వేడ్కతోడన్, ఒక్కవెరవు, వట్టి.


తా.

ఇట్లని గోపాలుఁడు స్తుతించి సూర్యబింబములోని నారాయణుఁడు కనబడకుండుటఁ దెలిసికొని.


క.

వెలయ మనం బాయసమున్
లలి సామాదిప్రియకరలలితామ్నాయో
క్తుల కేకయనందన కిం
పలరురసజ్ఞ కమృతంబు నట్టు లొసంగున్.

23