పుట:Lanka-Vijayamu.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

లంకావిజయము


అమరము. ఈవు, ఇదె, కొనుమంచున్, ఓపికన్, నతిన్ = నమస్కారమును, వాంఛాపూరణకారణముగన్, సరసోక్తులతోన్, ఒసంగెన్.


తా.

ఓలక్ష్మీపతీ! శుభాకరుఁడవు. ఇదె స్వీకరింపు మని గోపాలమంత్రి యాతనికిఁ దనకోర్కులు నెఱవేఱుటకై నమస్కారము చేసెను.


వ.

అ ట్లొసంగి మఱియు నిట్లనియె.

20


అర్థము రెంటస్పష్టము.


క.

అలయకమున్ బాయసమున్
లలితామృతమూర్తినిన్ ఘనశ్యామలు భా
మలు సేవింపగ ని మ్మిఁక
నలఘుమతిన్ దీనఁ గోర్కులన్నియు నమరున్.

21


రాఘవ.

అలయకమున్ = అలయకమునుపు (ప్రాతఃకాలమందు), లలితామృతమూర్తినిన్ - లలిత = సుందరమైన, అమృతమూర్తినిన్ = అమృతస్వరూపమైన, పాయసమున్ = పరమాన్నమును, ఘనశ్యామలు = మంచివయస్సుగల, భామలు = స్త్రీలు (కౌసల్యాదులు), సేవింపఁగన్ = భుజించుటకై, ఇమ్ము, ఇఁకన్ = ఇంకమీఁద, అలఘుమతిన్ = యోగ్యమైనమనస్సుతో, దీనన్ = ఈపాయసముతో, కోర్కులన్నియున్, అమరున్ = ఒనగూడును.


తా.

అమృతస్వరూపమైన యీపాయసమును నీ భార్యలకు బ్రాతఃకాలమందు భుజింప నిమ్ము. దీనివలన నీకోర్కులు సిద్ధించును.


లక్ష్మణ.

అల... బాయన్ - ఆల = ఆ, ఆకమున్ = పాపమును, పాయన్ = పాపుకొఱకు "అకంపాపేచదుఃఖేన” అని విశ్వప్రకాశము. సమున్ = సముఁడవైనట్టియు, లలితామృతమూర్తిన్ = సుందరమైన మోక్షస్వరూపుడవైనట్టియు, ఘనశ్యామలున్ = మేఘముభంగి శ్యామల(నీల)వర్ణుఁడ వైనట్టియు, భామలున్ - భా = కాంతిచే, అమలు = స్వచ్ఛమైనట్టియు, నిన్ = నిన్ను, సేవింపఁగ నిమ్ము = కొలువనిమ్ము, అలఘుమతిన్, దీనన్ = ఈసేవవలన, కోర్కులన్నియున్, అమరున్ = సమకూరును.