పుట:Lanka-Vijayamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

31


ప్రసన్నమూర్తి = నిర్మలమైన దేహముకలవాఁడా! భవ్యపరమభక్తపా - భవ్య = శుభులైన, పరమ = ఉత్కృుష్టులైన, భక్త = భక్తులను, పా = పాలించువాఁడా! త్రికా.. స్థితి - త్రికాల = మూఁడుకాలములయందు, సత్, ఉరు, శ్రీకర = శుభకరమైన, స్థితి = ఉనికిగలవాఁడా! శుభకృద్గతి = శుభప్రదగమనముగలవాఁడా! అను = అనునట్టి, గుణమహిమయుతుఁడు = గుణమహిమతోఁ గూడుకొనినట్టియు, గురుబుద్ధి = బృహస్పతిబుద్ధివంటి బుద్ధిగల, అతఁడు = గోపాలుఁడు, హితతఁ జేరి, పేరను, అతని = నారాయణమూర్తిని బిలిచెను.


తా.

సూర్యబింబము ప్రకాశించుచుండఁగా నాబింబమధ్యమున గృష్ణనామముగల యొక్కదివ్యభూషణభూషితుఁ డైనపురుషుఁడు తనకన్నులకు బొడగట్ట, గోపాలమంత్రి ననుస్కారము చేయుచు, ఓప్రసన్నమూర్తీ! భక్తపాలక! శుభకర! మహిమాన్వితా! యని (సూర్యమండలవర్తి యైన) నారాయణుని స్తుతించెను.


క.

శ్రీపాయసంబు తోడుత
నేపగుకల్యాణపాత్ర మీ విదె కొను మం
చోపిక నొసంగె నతివాం
ఛాపూరణకారణముగ సరసోక్తులతోన్.

19


రాఘవ.

శ్రీపాయసంబుతోడుతన్ = శోభాయుక్త మైనపరమాన్నముతో, ఏపగు = హెచ్చయిన, కల్యాణపాత్రము = సువర్ణ పాత్రము, ఈవు = నీవు, ఇదె = ఇదిగో, కొనుము = పుచ్చుకొమ్ము, అంచు = అని పలుకుచు, ఓపికన్, అతివాం . . .ముగ - అతి = విస్తారమైన, వాంఛా = కోరికను, పూరణ = పూర్తిచేయుటకు, కారణముగ, సరసోక్తులతోన్, ఒసంగెను.

'

తా.

పరమాన్నముతో నిండినయొక బంగారుగిన్నెను, ఇదిగో నీవు పుచ్చుకొమ్మని దశరథునికోరిక తీరుటకుఁ గారణమయినదాని నాప్రాజాపత్యపురుషుఁ డిచ్చెను.


లక్ష్మణ.

శ్రీపా = శ్రీపతీ! యసంబుతోడుతన్ = కీర్తితో, ఏపగు, కల్యాణపాత్రము = శుభమునకు యోగ్యమైనవాఁడవు, “యోగ్యభాజనయోః పాత్రం"