ఈ పుట ఆమోదించబడ్డది
కుటుంబ నియంత్రణ - పద్ధరులు 97
బిళ్ళలుగాని నూటికి నూరుపాళ్ళు గర్భం రాకుండా అరికడతాయని చెప్పడం కష్టం. కొన్ని సందర్భాలలో ఈ పద్దతి పని చేయక గర్భం రా వచ్చు.
* * *
10. కాయిటస్ రిజర్వేటస్
అనంతం అనూహ్యమైన పనులు చేస్తూ వుంటాడని అతని స్నేహితులందరికీ తెలుసు. కాని కుటుంబ నియంత్రణ పద్ధతిగా అతను అవలంబించే పద్ధతి అలా వుంటుందని ఎవరూ ఊహించలేదు. అనంతరం దృష్టిలో అతను అవలంబించే పద్ధతే తేలికైనది, ఖర్చు లేనిది. పైగా మగవానికి ఆమాత్రం సంయమనం లేకపోతే ఎందుకని వాదిస్తాడు. ఇతరుల విషయం ఎలావున్నా అతని సంయమన్ననికి అభివందనా లర్పించవలసిందే. అతనిలో బార్య ఎడల తన కర్తవ్య నిర్వహణ, సంతాన నిరోధం ఎడల పట్టుదల లేనిదే రతిలో వీర్యస్కలనం జరగకుండా బార్యకు సుఖప్రాప్తి ఎలా కలిగించగలడు అందుకోసమే అనంతం రతిలో తాను ఎక్కువ ఉద్రేకపడకుండా బాహ్యప్రేరణ పద్దతుల ద్వారా బార్యని బాగా