పుట:KutunbaniyantranaPaddathulu.djvu/96

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 96

మార్గంలోకి జొప్పించి సంయొగంలో పాల్గొనవలసి వస్తుంది. ఒకవేళ వీటిని యోనిమార్గంలోకి ప్రవేశపెట్టి సంయోగంలో పాల్గొనకుండానే లేచి నడిచి మల మూత్ర విసర్జనలలో దేనికయినా వెళ్ళవలసివస్తే మళ్ళీ వాటిని వాడవలసిందే. ఈ ఫోమ్స్ తాత్కాలికంగా అంటుకొని బట్టలకి రంగు వచ్చినా ఆమరకలు ఉతికితే పోతాయి.

ఒకవేళ సంయోగం అవగానే ఢూష్ చేసుకోవలసిన అవసరం వుంటే ఈఫోమ్స్ వాడేటప్పుడు కనీసం ఆరుగంటలు డూష్ చేసుకోకుండా కూడా ఆగవలసి వుంటుంది. ఎందుకంటే సంయోగ సమయంలో యోనిమార్గంలో ప్రవేశించిన వీర్యకనాలన్ని ఒక్కసారిగా నిర్మూలింపబడవు. కొన్ని వీర్యకణాలు వీర్యస్కలనం అయిన తరువాత కొన్ని గంటలపాటు జీవించే వుంటాయి. డూష్ వెంటనే చేసుకుంటే ఫొమ్ తుడిచి పెట్టుకుని పోతుందికాని వీర్యకణాలు కొన్ని మాత్రం యోని మార్గంలో అంటిపెట్టుకొనే వుంటాయి. ఫొమ్స్ వాడేటప్పుడు డూష్ చేసుకునే అలవాటు మంచిది కాదు. ఫొమ్స్ వాడేవాళ్ళు సంయోగానికి ముందు ఫోమ్స్ వాడి తిరగడం తప్పు. అయినా సంయోగానంతరం లేచి తిరగవచ్చు.

ఫోమ్స్ గాని, ఫొమ్ బిళ్లలుగాని వాడితే కేన్సరులాంటివి యేవీ రావు. అలాగే ఫోమ్స్ వాడినప్పుడు గర్భం వస్తే గర్భంలోని బిడ్డికి యెటువంటి అవలక్షణాలు రావు. ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలి. పోమ్స్‌గాని, పోమ్