పుట:KutunbaniyantranaPaddathulu.djvu/98

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 98

ఉద్రిక్తపరచి సంయోగంలో వీర్యస్కలనం అవకుండా నిభాయించుకొనే శక్తిని అలవర్చుకున్నాడు. ఎప్పుడైనా సంయోగంలో వీర్యస్కలనం అయిపొతుందేమోనన్న అనుమానం వుంటే రతిలో పాల్గొనడానికి కొద్దినిముషాల ముందు హస్తప్రయొగం ద్వారా వీర్యనష్టం కలిగించుకొని అసలు రతిలో అంత త్వరగా వీర్యస్కలనానికి ఆస్కారం లేకుండా చూచుకునేవాడు. రతిలో వీర్యస్కలనం కాకుండా వుండటం, అదే సమయంలొ భార్యకి ఎటువంటి అసంతృప్తి కలగకుండా చూడటం అతని ఉద్దేశ్యం. బార్యకి సుఖప్రాప్తి కలిగిందని బావించగానే ఇక తనుకూడా ఉద్రేకాన్ని చల్లార్చుకుని, వీర్యస్కలనం అవకుండా ఆపేసుకొవడం అతను అవలంబించే పద్ధతి.

సంతాన నిరోధక పద్ధతిగా అనంతం అవలంబించే పద్ధతినే "కాయిటస్ రిజర్వేటస్ " అని అంటారు. ఈ పద్ధతిని పురుషుడు స్త్రీకి సుఖప్ర్రాప్తి కలగడం కొరకు యోనిలోపురుషాంగ ప్రవేశం జరిపి రతి నిర్వహించినా, యోనిలోపల కాని, బయటగాని వీర్యస్కలనము చేయడమంటూ వుండదు. రతి చివరలో పురుషుడు వీర్యస్కలనం జరగకుండానే ఉద్రేకాన్ని చల్లార్చుకుని పురుషాంగాన్ని కుంచించుకుపోయేటట్లు చేసుకుంటాడు. "కాయిటాస్ ఇంటేరప్టస్ " లో అయితే పురుషుడు రతిలో పాల్గొని వీర్యస్కలనం అవబొయే సమయానికి పురుషాంగాన్ని యోనిలో నుంచి ఉపసంహరింపచేసి