పుట:KutunbaniyantranaPaddathulu.djvu/95

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 95

యంలోగాని, తరువాతగాని యోనిమార్గం నుంచి కారినట్లయితే కొంత అసౌకర్యాన్ని కలిగిస్తాయి. ఈ "ఫోమ్స్"ని టిన్నులలో కాని, సీసాలలో కాని గట్టి ప్రెషర్‌లో పాక్ చేసు ఉంచుతారు. ప్రత్యేకమైన అప్లికేటరు ద్వారా దానిని తీసి యోని మార్గంలోకి ప్రవేశ పెట్టడం జగుగుతుంది. మామూలుగా "డెల్ఫిన్" ఫోమ్‌ని వాడడం జరుగుతుంది. ఈ ఫొమ్ చాలా తేలిక, ఉపయుక్తమైనదీను.

ఫోమ్స్ ఫోమ్ బిళ్ళలు వాడే విధానము

ఫోమ్ వాడేముందు ఆ ద్రవాన్ని బాగా కుదపాలి. ఒక చిన్న పిచికారీలాంటిది ఫోమ్‌తో బాటు సరఫరా చేయబడుతుంది. పిచికారీని పూర్తిగా క్రిందకి నొక్కేసి ఫోమ్ ఉన్న దానికి బిగించినట్లయితే, దాని లోపల వున్న ప్రెషర్ వల్ల పిచికారీలోకి ఫోమ్ చేరుకుంటుంది. నిదానంగా ఫోమ్‌తో నిండిన పిచికారీని తీసుకుని యోని మార్గంలోకి ప్రవేశాపెట్టి పిచికారీ పిస్టల్ని నొక్కాలి. అలా చెయగానే ఫోమ్ యోని మార్గంలోకి చేరిపోతుంది. ఫోమ్ ట్యాబ్లెట్లని అయితే యోని మార్గంలోకి రెందువ్రేళ్ళతో పట్టుకుని లోపలికల్లా ప్రవేశ పెట్టాలి. ఫోమ్స్‌గాని. ఫోమ్ బిళ్ళలు కాని యోని మార్గంలోకి ప్రవేశపెట్టిన తరువాత ఒక గంటలోగానే సంయోగం చేయాలి. గంటగడచిన తరువాత సంయోగంలో పాల్గొంటే వాటి ఫలితం లేకుండా అయిపోతుంది. తిరిగి వాటిని యోని