పుట:KutunbaniyantranaPaddathulu.djvu/94

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 94

మార్గంలో వాడే పద్దతి చాలా ప్రాచీన కాలంనుంచి అమలులో ఉంది. 3500 సంవత్సరాల క్రితమే ఒక ఈజిప్టు రచయిత గర్భనిరోధకానికి తుమ్మబంక కలిపి తయారుచేసిన ద్రవం వాడబడుతుందని తన రచనలో తెలియజేశారు. రోజులు గడుస్తున్న కొద్దీ వీర్యకణాలని నాశనం చేసే గర్భనిరోధకరసాయనకాలు తయారయి వాడబడుతూ వచ్చాయి. ఈ రకమైనవి యోని మార్గంలో సంయోగ సమయంలొ వాడినప్పుడు ఆ స్త్రీ ఆరోగ్యానికి ఎట్టి నష్టం కలగకుండా కేవలం వీర్యకణాలనే నాశనంచేసి గర్భాశయ కంఠాన్ని కూడా తాత్కాలికంగా మూసివేస్తాయి. ఇలా జరగబట్టి ఏ కొద్దిపాటి వీర్య కణాలయినా నిర్మూలింపబడకుండా ఉంటే గర్భాశయ కంఠం మూసివేయబడి ఉండబట్టి దాని ద్వారా గర్భాశయంలోకి ప్రవేశించలేవు.

వీర్యకణాలని నాశనం చేసే 'ఫోమ్స్‌' గర్బం నిరోధించటంలో క్రీమ్స్, జెల్లీలుకంటే బాగా పని చేస్తాయి. ఈ "పోమ్" ఒక నురగలాంటి ద్రవం. దీనిని యోని మార్గంలో ప్రవేశ పెట్టగానే చాలా త్వరగా మొత్తం యోని మార్గం అంతానిండిపోతుంది. పైగా గర్భాశయ కంఠాన్ని కూడా ఆక్రమించి, అందులోని ద్వారాన్ని మూసివేస్తుంది. జెల్లీలు, క్రీమ్స్ ఇలా యోనిమార్గాన్ని ప్రభావితం చేయడంగాని, గర్భాశయ ద్వారాన్ని మూసివేయడముగాని చేయలేవు. అంతేకాకుండా ఈ క్రీమ్స్, జెల్లీలు సంయోగ సమ