కుటుంబ నియంత్రణ - పద్ధతులు 81
ముందు 8 రోజులు, తరువాత 18 నుంచి 28 వ రోజు వరకు దాంపత్య జీవితంలో పాల్గొంటే గర్భం రాదు. ముందు ఎనిమిది రోజులను, తరువాత 11 రోజులను, 'సేఫ్ పిరియడ్ ' అనీ, రక్షిత కాలమనీ అంటారు. ఇంతవరకు మనం తెలుసుకున్నది ప్రతి 28 రోజులకీ బహిస్టు కీ అయ్యే స్త్రీ విషయం గురించి మాత్రమే. అలా కాక కొందరు స్త్రీలు 21 రోజులకే బహిస్టు అవుతూ ఉంటారు. మరికొందరు 30 రోజూలకీ, 35 రోజులకీ, 38 రోజులకీ బహిస్టు అవుతూ ఉంటారు. ఇటువంటి స్త్రీలలో ముందు అండం విడుదల ఎప్పుడు అవుతుందో తెలుసుకొని దాని ప్రకారం 'సేఫ్ పిరియడ్ ' ని పాటించజలి.
అండం విదుదల తెలుసుకోవడమెలా ?
ప్రతీ 35 రోజులకు ఒకసారి బహిస్టు అయ్యే స్త్రీ ఉన్నదనుకోండి. ఆమెకు బహిస్టు అయిన 21 వ రోజున అండం విడుదల అవుతుంది. అది ఎలా చెప్పడమంటే ఏ స్త్రీలో అయినా రాబోయే బహిస్టుకి సరిగ్గా 14 రోజుల ముందు అండం విడుదల అవుతుంది 35 రోజుల కొకసారి బహిస్టు అయ్యే స్త్రీకి 14 రోజుల ముందు అంటే 21 వ రోజు అవుతుంది కూడా. అలాగే ప్రతి 30 రోజులకి బహిస్టు అయ్యె స్త్రీకి 6వ రోజున ప్రతి 21 వ రోజున బహిస్టు అయ్యే స్త్రీకి 7 వ రోజున అండం విడుదల అవుతుంది.