Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/80

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 80

మార్గంలో స్కలనమైన వీర్యకణాలు 3 రోజులపాటు బతికి వుండి అండంతో కలయిక పొందే శక్తి కలిగి వుంటాయి. అందుకని అండం విడుదల అవడానికి మూడురోజులు ముందు సంయోగంలో పాల్గొన్నా ఆ వీర్యకణాలు అండం విడుదల అవగానే దానితో కలయిక పొందుతాయి దీనివల్ల 9వ రోజు సంయోగంలో పాల్గొన్నప్పుడు అండం విడుదల లేక పోయినప్పటికీ 12 వ రోజు అండం విడుదల జరిగితే గర్భం రావడం జరుగుతుంది. ఒకసారి స్కలనమైన వీర్యకణాలకు మూడు రోజులపాటు శక్తి కలిగి ఉంటే, ఒకసారి విడుదలయిన అండానికి ఒక్కరోజు మాత్రమే వీర్యకణాలతో కలయిక పొందే శక్తి ఉంటుంది. అందుకని అండం విడుదల చివర 16 వ రోజున జరిగితే ఒక వేళ 17 వ రోజున దాంపత్య జీవితంలో పాల్గొంటే గర్బం రావడానికి వీలు ఉంది. అలా కాక 18 వ రోజున సంయోగంలో పాల్గొంటే గర్భం రావడానికి అవకాశంలేదు. దీనికి 16వ రోజున విడుదల అయిన అండానికి 24 గంటలు గడిచిన తరువాత వీర్యకణాలతో కలయిక పొందే శక్తి ఉండదని తెలుసుకదా. ఈ విధంగా అండం విడుదలయ్యే సమయం, వీర్యకణాలకీ, అండానికీ కలయిక పొందే శక్తి మొత్తం దృష్టిలో పెట్టుకుని చూస్తే బహిస్టు ప్రారంభమయిన 9 వ రోజునుంచి 17 వ రోజు వరకు 'అన్ సేఫ్ పిరియడ్ ' లేక డేంజరస్ పిరియడ్ గా భావించబడుతుంది. ఇంతవరకు చెప్పుతున్న ఈ రోజులను వదలిపెట్టి