పుట:KutunbaniyantranaPaddathulu.djvu/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 79

డానికి "రక్షిత కాలం" అని అంటారు. ఈ రక్షిత కాలంలో దాంపత్య జీవితాన్ని గడిపినట్లయితే స్త్రీ గర్భవతి కావడం జరగదు. ఈ రకంగా స్త్రీకి గర్భం రాని రోజులను గుర్తిస్తే సంయోగంలో పాల్గొనడానికి ఎటువంటి కుటుంబ నియంత్రణ సాధనాలు అవసరమూ వుండదు. ఒక పైసా ఖర్చూ వుండది.

బహిస్టుకి ముందు బహిస్టుకి తరువాత గర్భం రాని రోజులు

సాధారణంగా స్త్రీకి బహిస్టు స్రావం ప్రారంభము అయినరోజు నుంచి మరొక బహిస్టు ప్ర్రారంభం కావడానికి 28 రోజులు పడుతుంది. ఇలా 28 రోజుల కొకసారి బహిస్టు అయ్యే స్త్రీలో అండం విడుదల బహిస్టు అయినరోజు నుంచి లెక్కపెడితే 14 వ రోజున అవుతుంది. అంటే ఒక బహిస్టుకి మరొక బహిస్టుకి సరిగ్గా మధ్యకాలాన అండం విడుదల అవుతుంది. కాని ప్రాక్టికల్ గా చూస్తే కరెక్టుగా ప్రతి 28 రోజులకి బహిస్టు అయ్యే స్త్రీలో అయినా సరిగ్గా 14 వ రోజుననే కాకుండా 12 నుంచి 16వ రోజులో ఎప్పుడైనా అండం విడుదల జరగవచ్చు. ఈ అండం విడుదలయ్యే రోజులలో సంయోగంలో పాల్గొంటే గర్భం రావడానికి ఎక్కువ అవకాశాలు వున్నాయి. సంయోగ సమయంలో యోని