పుట:KutunbaniyantranaPaddathulu.djvu/82

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 82

ఇలా అండం విడుదల రోజు గుర్తించి ఇక డేంజర్ పిరియడ్ ని లెక్కకట్టవచ్చు. కట్టాలంటే, అండం విడుదల రోజుకి ముందు అయిదు రోజులు తరువాత మూడు రోజులు కలపాలి. అ రకంగా లెక్కకడితే ప్రతి 35 రోజులకి బహిస్టు అయ్యే స్త్రీలో 16వ రోజునుంచి 24 వ రోజువరకు డేంజర్ పెరియడ్ అవుతుంది. దీనికి ముందు 15 రోజులు, తరువాత 25, 35 వ రోజు వరకు గర్భం రాకుండా ఉండే రక్షితకాలం.

సేఫ్ పెరియడ్ లో డేంజర్ !

ఇంతవరకు మనం తెలుసుకున్న సేఫ్ పెరియడ్స్ ప్రతినెలా కరెక్టుగా రావలసిన రోజులకే బహిష్టులు వచ్చే వాళ్ళలోనే సంభవం. ఒకసారి బహిస్టు 28 రోజులకు వచ్చి మరొకమారు 30 రోజులకు వచ్చి ఇంకోసారి 26 రోజులకి వస్తూ సరిగా బహిస్టులు రాని వాళ్ళలో సేఫ్ పిరియడ్ ఫలానా అనే దానిమీద ఆధారపడటం ప్రమాదకరం. అస్తవ్యస్తంగా బహిష్టులు ఉండే వాళ్ళల్లోనే కాకుండా కాన్పు అయిన తరువాత, ముట్లు ఎండిపోయే ముందు సేఫ్ పిరియడ్ లెక్క కట్టడం కుదరదు. ఒకేసారి 28 రోజుల కొకసారి 30 రోజుల కొకసారి ఇలా కొద్ది తేడాలతో బహిష్టు అయ్యే సంధర్భంలో అండం విడుదల కూడా తేడాగా ఉంటుంది.