పుట:KutunbaniyantranaPaddathulu.djvu/75

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 75

లతో కొద్ది క్షణాలపాటు వీర్యస్కలనం అవుతుంది. ఈ రెండవ రకము వ్యక్తుల్లో వీర్యస్కలనం ముందు కొంత తెలియకుండా నిదానంగ అవడానికి ఆస్కారం ఉంది. ఇటువంటి వ్యక్తులలో ముందు జరిగే వీర్యస్కలనం అనుభూతి వుండదు. చివరికి జరిగే వీర్యస్కలనం అనుభూతే వుంటుంది.

వీర్యస్కలనం తెలిసి అవడం, తెలియకుండా అవడం దాన్నిబట్టే కాకుండా రతి కొనసాగించగల సమయం బట్టి కూడా ఉపసంహరణ సామర్ధ్యం ఆధారపడి వుంటుంది. 50 శాతం పురుషులకి రతిలో పాల్గొన్న రెండు నుంచి అయిదు నిమిషాలలోగా వీర్యస్కలనం అయిపోతుంది. మిగిలిన 50 శాతం పురుషుల్లో రతిలో పాల్గొన్న అయిదునుంచి ఇరవై నిమిషాలకి వీర్యస్కలనం జరుగుతుంది. అయిదు నిమిషాలలోగా వీర్యస్కలనము అయిపోయే పురుషులు పురుషాంగ ఉపసంహరణ పద్దతిని సక్రమంగా అమలుపరచలేరు. ఈ రెండూ కాకపోతే ఒక్కొక్కసారి రతిలో కామోద్రేకం పతాకస్థాయికి చేరుకుని సరిగా వీర్యస్కలనం అవబోయే ముందు స్త్రీకిగాని, పురుషునికి గాని, లేక యిద్దరికి ఒక రకమైన శారీరక అశక్తత కలిగించుతుంది. అటువంటి స్థితిలో పురుషాంగం ఉపసంహరించాలన్నా కుదరని స్థితి లేదా ఆ మైకంలో ఈ విషయమే మరచిపోయే గతి పట్టవచ్చు.