పుట:KutunbaniyantranaPaddathulu.djvu/76

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 76

ఉపసంహరణ పద్ధతి రతిలో అసంతృప్తి

కుటుంబ నియంత్రణ పద్ధతిగా అవలంబించే ఉపసంహరణ పద్ధతి వల్ల నరాల సంబంధంగా గాని, శారీరకంగా గాని బలహీనత కలుగుతుందా అనే విషయంపై విశేషంగా పరిశోధనలుజరిగాయి చివరికి దీనివల్లఎటువంటినరాల బలహీనతలు కలగవనీ, శారీరకబలహీనతలు ఏర్పడవనీ నిర్ధారించారు. అయితే రతిలో తృప్తి కలిగే విషయంలో కొంత లోపం ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీలలో సుఖప్రాప్తికలగడానికి కొంత సమయం పట్టుతుంది. కొన్ని సందర్బాల్లో స్త్రీకి సరిగ్గా సుఖప్రాప్తి ప్రారంభమయ్యే సమయానికి పురుషాంగాన్ని రతి నుంచి ఉపసంహరించడం జరుగుతుంది. ఇటువంటప్పుడు ఆ స్త్రీకి రతిలో అసంతృప్తి కలగడమో, రతి అంటేనె అసహ్యం కలగడమో జరుగుతాయి.

ఇలా కొందరు స్త్రీలలో రతి యెడల అసంతృప్తి ఏర్పడితే, మరికొందరిలో పురుషుడు ఉపసంహరణ చేయకపోతే వీర్యస్కలనం జరిగి ఎక్కడ గర్భం వస్తుందో అని భయపడి పోతూ వుంటారు. వారికి సంయోగంలో ఆనందం కంటే, భయం ఎక్కువగా వుంటూ వుంటుంది. ఇదే పరిస్థితి కొందరి పురుషులలో కూడా ఏర్పడుతూ వుంటుంది. ఎక్కడ పొరపాటున వీర్యస్కలనం అయిపోతుందో ఎక్కడ గర్భం వస్తుందో అనే భయంతో సంయోగంలో సరిగ్గా పాల్గొనలేక