పుట:KutunbaniyantranaPaddathulu.djvu/74

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 74

వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ పద్ధతివల్ల మానసికంగా అసంతృప్తి కలిగే ప్రమాదం ఉంది. ఎక్కుడ వీర్యస్కలనం అయిపోతుందో, ఎక్కడ గర్భం వచ్చేస్తుందో అనే భయంతో దంపతులిద్దరూ భయం భయంగా రతిలోపాల్గొన్నట్లయితే దాంపత్యసుఖం అనుభవించడానికి అవకాశం ఉండదు. ముఖ్యంగా స్త్రీ రతిలో పరాకాష్టని పొందలేదు. ఒకవేళ ఆమె రతిలోఉత్సుకత కనబరిచినా కోరిక పరాకాష్టకు చేరుకోబోయే సమయానికి పురుషాంగ ఉపసంహరణతో అసంతృప్తే మిగిలి తీరుతుంది.

ఉపసంహరణ పద్ధతి - లోపాలు

గర్భనిరొధక పద్దతిగా ఈ విధానము అవలంబించేటప్పుడు స్త్రీ ముందు తనకి గర్భము రాకుండా పురుషుడ్ని జాగ్రత్త తీసుకోవాలని కోరాలి. ఎందుకంటే పురుషునికి వీర్యస్కలనం ఎప్పుడు అవుతుందో స్త్రీ మొందే గమనించ లెదు. ఒక్కొక్కసారి తాను జాగ్రత్తగానే ఉంటానని పురుషుడు స్త్రీని నమ్మించి మాట నిలుపుకోలేకపొవచ్చు. అదీగాక పురుషునికి కామోద్రేకము చరమస్థాయికి చేరుకున్నప్పుడు ఒక్కొక్కసారి పురుషాంగ ఉపసంహరణ దుర్లభం అవవచ్చు. ఒక్కొక్కసారి ఆస్థితిలో పురుషాంగ ఉపసంహరణ చేస్తుండగానే తెలియకుండా వీర్యస్కలనము అయిపోవచ్చు. 50 శాతము పురుషుల్లో నిదానంగా రెండు మూడు పట్టు విడుపు