పుట:KutunbaniyantranaPaddathulu.djvu/73

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 73

స్కలనమైన వీర్యకణాలు యోని మార్గముగుండా ప్రయాణించి కడుపు తెచ్చిన సంఘటనలు కావలసినన్ని ఉన్నాయి.

కొంతమంది పురుషుల్లో వీర్యస్కలనం అయిన తరువాత కూడా అంగ స్తంభనం కొంత సమయము నిలిచే ఉంటుంది. ఇటువంటి యువకులు వీర్యస్కలనం ఎటువంటి ప్రమాదం లేకుండా పూర్తిగా బయటచేసి తిరిగి సంయోగానికి వెంటనే పూనుకుంటారు. ఇటువంటప్పుడు శిశ్నంకి చివర ఉన్న మూత్రనాళాన్ని తుడిచివేయాలి. శిశ్నాన్ని కప్పిపుచ్దే చర్మాన్ని కూడా పూర్తిగా గుడ్డతో తుడిచి వీర్యము దానికి అంటుకుని ఉండకుండా జాగ్రత్త పడాలి.

సంభోగ సమయంలో శుక్లమును విడవకుండా వుంటే

భార్యా భర్తలు రతిలో పాల్గొని భర్త సరిగ్గా వీర్య స్కలనం అవబోయే సమయానికి పురుషాంగాన్ని యోని నుంచి ఉపసంహరించే పద్ధతినే "పురుషాంగ ఉపసంహరణ పద్ధతి"అని అంటారు. ఇది అతి తేలికైన పద్ధతి, ఖర్చులేని పద్ధతి అయినా కొన్ని సందర్బాలలో పురుషాంగ ఉపసంహణ జరగక ముందే వీర్యస్కలనం అయిపోయిగర్భం