పుట:KutunbaniyantranaPaddathulu.djvu/63

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 63

ఈ రకంగా గర్బాశయం, దాని చుట్టు ప్రక్కల వాపు రావడానికి వ్యాధి క్రిములు ప్రవేశించడమే. వ్యాధి క్రిములు గర్బాశయంలోకి, అండవాహికల్లోకి ప్రవేశించడానికి కారణం లూప్ పరిశుబ్రమైన స్థితిలో ఉండకపొవడమో, లూప్‌ని అప్లి కేటర్ ద్వారా లోపలికి ప్రవేశపెట్టేటప్పుడు యోనిలో ఉండే క్రిములు దానిద్వారా లోపలికి ప్రవేశించడమో, లేదా తరువాత యోనిలోపల ఉండే లూప్ దారాల ద్వారా క్రిములు లోపలికి ప్రవేశించడమో జరుగుతుంది.

కొన్ని సందర్భాలలో అంతకు ముందే గర్భకోశం లోపలగాని, దాని చుట్టుప్రక్క్జలగాని చైతన్య రహితంగా ఉన్న క్రిములు లూప్ వేయడం ద్వారా వాటిల్లో కదలికలు వచ్చి బాగా వృద్ధి చెంది వ్యాధి లక్షణాలని కలుగజేయవచ్చు.

లూప్ వేయడంవల్ల ఇన్ ఫెక్షను వచ్చి గర్బాశయం, దాని చుట్టు ప్రక్కల వాపు, నొప్పి కలుగుతున్నదని అనుమానం కలిగినపుడు లూప్‌ని తీసివేసి పెన్సిలిన్, టెర్రామైసిన్, జెంటామైసిన్ వంటి యాంటిబయాటిక్స్ ఏదో ఒకటి వాడాలి. దానితొ ఇన్ ఫెక్షను తగ్గిపోతుంది.

అరుదుగా కొందరికి లూప్ వేస్తున్న సమయంలోగాని, తరువాతగాని లూప్ గర్భాశయం పొరలను చేదించుకుని కడుపు లోపలికి వెళ్ళి పోతుంది. దీనినే 'పెర్‌ఫోరేషన్ ' అంటారు. ఇలా పెర్‌ఫోరేషన్ జరగడం లూప్ వేయించు