కుటుంబ నియంత్రణ - పద్ధతులు 64
కున్న రెండు వేల మందిలో ఒకరికి జరుగుతుంది. కాన్పు అవగానేగాని, లేదా 4-6 వారాలలోగ గాని లూప్ వేసిన వారిలో ఈ విధంగా 'పెర్ ఫోరేషన్ ' జరగడం సహజం.
పెర్‌ఫొరేషన్ జరిగిందని కొందరిలో తెలియనే తెలియదు. చాలామందిలో గర్భాశయం పొరలని చేదించుకుని లూప్ కడుపులోపలికి పోయినా ఎటువంటి బాధగాని, ప్రమాదంగాని ఉండవు. మామూలుగా గైనిక్ చెకప్ చేసినప్పుడు యోనిలో వ్రేలాడుతూ కనబడే లూప్ దారాలు కనబడకుండా అవుతాయి. దానిబట్టి లూప్ గర్బసంచిలో లేదని తెలుసుకోవచ్చు. అదే కాకుండా కడుపుని ఎక్స్‌రే తీస్తే లూప్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా కూడా లూప్ గర్భాశయంలో ఉందా, చేదించుకుని బయటికి పోయిందా అనేది తెలుసుకో వచ్చు. లాప్రోస్కోపు పరీక్ష ద్వారా కూడా పెర్‌ఫొరేషన్ ద్వారా బయటికి వచ్చిన లూప్‌ని గుర్తించవచ్చు. అంతేకాదు లాప్రొస్కోప్ ద్వారా దానిని బయటికి తీసివేయవచ్చు. కొన్ని కేసుల్లో పెర్‌ఫొరేట్ చేసి బయటికి వచ్చిన లూప్ బయట ఇరుక్కుని పోయి ఉంటుంది. అటువంటప్పుడు ఆపరేషన్ చేసి కడుపులో ఉన్న లూప్‌ని తీయవలసి వస్తుంది.
లూప్ వేయించుకున్నా గర్భం రావచ్చా ?
లూప్ వేయించుకున్న వాళ్ళల్లో నూటికి ఇద్దరు నుంచి నలుగురి దాకా గర్భం రావచ్చు. ముఖ్యంగా ఈ ఫెయి