పుట:KutunbaniyantranaPaddathulu.djvu/62

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 62

ఒకరిద్దరు పిల్లలు పుట్టిన స్త్రీలు లూప్ వేయించుకున్నప్పుడు వచ్చే బాధలు కంటేఅసలు పిల్లలు కలగగుండా లూప్ వేయించుకున్న వారిలో వచ్చే బాధలు కాస్త ఎక్కువ.

లూప్ వల్ల ధుష్పరిణామాలు

లూప్ వల్ల వచ్చే దుష్పరిణామాలు చాలాకొద్ది మందిలో కలుగుతాయి. లూప్ వేయించుకున్నప్పుడు మామూలుగా వచ్చే కడుపులో నొప్పి, కాస్త ఎక్కువ బ్లీడింగు అవడం, లూప్ వేయించుకున్న మొదట్లో అప్పుడప్పుడు కాస్త కాస్త బ్లీడింగు కనబడడం కాంప్లి కేషన్లు క్రింద పరిగణించడం జరగదు. ఎక్కడో ఎవరికో మరీ ఎక్కువ బ్లీడింగు అవడం, మందులు వాడినా ఫలితం కనపడకపోవడం అవుతుంది. అటువంటి సందర్బాలలో లూప్ తీసివేస్తే ఆ బాధ తొలగిపోతుంది. అయితే చాలామందిలో మందు బిళ్లలు వాడటంతో కొద్ది రోజుల్లోనే బాధలు సర్దుకుపోతాయి.

లూప్ వేయించుకున్న 100 మంది స్త్ర్రీలలో 2.2 నుంచి 7.7 స్త్రీలల్లో లూప్ వల్ల గర్భాశయం, అండవాహికలు వాచడమో, గర్బాశయాన్ని చీల్చుకుని లూప్ కడుపులోపలికి ప్రవేశించడమో, గర్బాశయం చుట్టు ప్రక్కల వాపు వచ్చి కడుపునొప్పి విపరీతం అవడమో జరుగుతుంది.