పుట:KutunbaniyantranaPaddathulu.djvu/59

వికీసోర్స్ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 59

ఇంతవరకు అవగాహన చేసుకున్న దాని బట్టి లూప్ గర్భాశయ కండరాలని, అండవాహికలని ఎక్కువగా ఉత్తేజపరచి కండర సంకోచం ఎక్కువ జరిగేటట్లు చేస్తుంది. అండవాహికలలో వీర్యకణాలు అండంతో కలయిక పొంది తరువాత అక్కడనుంచి గర్భాశయంలోకి చేరడం జరుగుతుంది. అయితే లూప్ వేయించుకున్న వారిలో వీర్యకణాలు కలయిక పొందిన అండం గర్బాశయానికి చేరలేకపోతుంది. ఒక వేళ చేరినా లూప్‌వల్ల గర్భాశయం లొపల కదలికలు ఎక్కువ ఉండి కలయికచెందిన అండం అక్కడ నిలద్రొక్కు కోలేకపోతుంది. ఇది ఇలా ఉండగా లూప్‌వల్ల గర్భాశయం లోపలి పొరలు నీరుచేరి కాస్త ఉబ్బడం జరుగుతుంది. దీనినే ఇన్ ఫ్లమేటరీ ప్రోసెస్ అంటారు. ఈ రకంగా గర్భాశయం లోపలి పొరలు అనుకూలంగా లేకపొవడంతో వీర్యకణంతో కలయిక పొందిన అండం నిలద్రొక్కుకోలేక నిర్వీర్యం అయిపోతుంది. అంతేకాకుండా లూప్ వల్ల గర్భాశయం లోపలి పొరల్లో ప్రోస్టాగ్లాండిన్స్ అత్యధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల గర్భాశయ కండరాలు మరింత ముడుచుకోవడం, సాగడం జరుగుతుంది. దానివల్ల సంయుక్త బీజకణం వీర్యకణంతో కలయిక పొందిన అండం నిలద్రొక్కుకోవాలనుకున్నా కుదరకుండా అవుతుంది. ఆ రకంగా సంయుక్త బీజకణం పిండంగా మారకుండా ఆగిపోతుంది. సంయుక్త బీజకణం పిండంగా రూపొందనప్పుడు నెలనెలా బహిష్టులు మామూలుగా వచ్చేస్తూ ఉంటాయి.