పుట:KutunbaniyantranaPaddathulu.djvu/60

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 60

కాపర్ -టి, మల్టీలొడ్ సి యు 250 లూప్‌ని బయో యాక్టివ్ కాపర్ డివైసిస్ అంటారు. ఈ రకమైన లూప్‌లు గర్భాశయంలో కాపర్ 'రాగి ' అణువులని విడుదల చేసి అక్కడి కణాలలో మార్పు తీసుకుని వస్తాయి. గర్భాశయంలో లూప్‌వల్ల కాపర్ అణువులు విడుదలైనా ఇవి రక్తం ద్వారా శరీరమంతా ప్రసరించడం జరగదు. గర్భాశయంలో విదుదలైన కాపర్ అణువులు అక్కడి కణాల్లో మార్పు కలిగించి సంయుక్త బీజకణం పిండంగా ఎదగకుండా క్షీణించి పోయేటట్లు చేస్తాయి.

ఔషధ పూరిత లూప్‌వల్ల గర్భనిరోధాన్ని మాత్రమే కలిగిస్తాయిగాని, స్త్రీ ఆరోగ్యానికి ఎటువంటి హాని కలిగించవు.

లూప్ వల్ల వచ్చే బాధలు

లూప్ వల్ల ఆరోగ్యానికి హాని లేకపోయినా కొందరిలో కొన్ని రకాల బాధలు కలుగుతాయి. కొందరు స్త్రీలకి లూప్ వేయగానే పొత్తి కడుపులో మెలిపెట్టుతున్నట్లు నొప్పి వస్తుంది. కొందరు అటువంటి నొప్పి రాఫడంతో భరించలేక క్షణకాలంపాటు కళ్ళు తిరిగి పడిపోతారు. కాని కొద్ది నిముషాల్లోనే తేరుకుంటారు. అందుకనే లూప్ వేయగానే వెంటనే టేబుల్ మీదనుంచి దిగకుండా కొద్ది సేపు పడుకుని ఉండడం మంచిది. దానివల్ల ఇటువంటి బాధ చాలా వరకు కనబడరదు.