పుట:KutunbaniyantranaPaddathulu.djvu/58

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 58

షను చేయించుకున్న స్త్రీకి ఆపరేషను చేయించుకున్న భాగం చాలా బలహీనంగా ఉన్నా లూప్ మంచిది కాదు.

పెళ్లి కాగానే లూప్ వేయించుకోవచ్చా ?

పెళ్లి కాగానే కొందరు దాంపత్య సంబందాలలో పాల్గొనక ముందే లూప్ వేయించుకోవాలనుకుంటారు. అలా వేయడం మంచిది కాదు. ఒకవేళ లూప్ వేయడం తప్పని సరి అయితే పూర్తి మత్తు ఇచ్చి వేయవలసి ఉంటుంది.

క్రొత్తగా పెళ్లి అయినవాళ్ళు వెంటనే గర్భం వద్దనుకున్నపుడు కొంతకాలంపాటు తక్కిన కుటుంబ నియంత్రణ పద్దతులు అవలంబించిన తరువత లూప్ వేయించుకోవడం మంచిది.

ఒక్క బిడ్డ కూడా కలుగకుండా లూప్ వేయించుకోవడానికి కొందరు డాక్టర్లు అంతగా ప్రోత్సహించరు. ఎందుకంటే అరుదుగానైనా ఎవరికో ఒకరికి గర్భకోశం, అందవాహికలు లూప్ వల్ల వాచే అవకాశం ఉంది. దానివల్ల వారిలో సంతానం కలిగే అవకాశాలు సన్నగిల్లుతాయి. ఆ ఉద్దేశ్యంతోనే అంతగా అవసరం అనుకుంటే తప్ప సంతానం లేకుండా లూప్ వేయించుకోవద్దని అంటారు.

లూప్ గర్భం రాకుండా ఎలా నిరోధిస్తుంది ?

లూప్ ఏ విధంగా గర్భం రావడాన్ని నిరోధిస్తుందనే విషయమై ఇంకా స్పష్టమైన శాస్త్రీయ వివరణ లేదు.