పుట:KutunbaniyantranaPaddathulu.djvu/57

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 57

కాపర్ -టి లూప్‌నిగాని, మల్టీలోడ్ సి యు 250 లూప్‌ని గాని రెండు-మూడు సంవత్సరాలకి ఒకసారి పాతది తీసివేసి క్రొత్తది వేయడం అవసరం. ఎందుకంటే ఈ లూప్‌లు ఔషధ పూరితమైనవి. 3 సంవత్సరాలు గడిచే సరికి ఈ ఔషధం తన ప్రభావాన్ని కోల్పోతుంది. కాపర్ టి లూప్‌లోగాని, మల్టీ లోడ్ సి. యు 250 లూప్‌లోగాని ఉండే ఔషధం కాపర్ 'రాగి '. ఈ కాపర్ రోజుకి 52 నుంచి 64 మైక్రోగ్రాములు తరిగిపోతూ ఉంటుంది. వీటికి సంబంధించిన కాపర్ తరిగిపోయిన తరువాత గర్భనిరోధం జరగదు.

కాపర్-టి లూప్‌ని ప్రత్రీ మూడు సంవత్సరాలకీ ఒకసారి తీసివేయాలి. మల్టీ లోడ్ సి యు 250 లూప్‌ని ప్రతీ రెండు సంవత్సరాలకి ఒకసారి తీసి వేయాలి. పాత లూప్ తీసి వెంటనే క్రొత్త లూప్ వేయవచ్చు.

లూప్ ఎవరు వేయించుకోకూడదు ?

గర్భిణీ లూప్ వేయించుకోకూడదు. అలాగే గర్భాశయంగాని, అండ వాహికలుగాని వాచి ఉన్నప్పుడు లూప్ వేయించుకోకూడదు. యోనిలో వ్యాధి వున్నా, గర్భాశయ కంఠానికి పుండు ఉన్నా, గర్భాశయంలో ఫైబ్ర్రాయిడ్స్ (గడ్డలు) ఉన్నా, అత్యధికంగా బహిష్టు స్రావం అవుతున్నా లూప్ వేయించుకోకూడదు. అలాగే ఆపరే