Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 49

గర్భాశయంలోకి లూప్‌ని ప్రవేశపెట్టు సాధనము

లూప్‌ని వేయడానికి ముందు లిప్పీస్ లూప్‌ని, దాన్ని లొపలకు ప్రవేశపెట్టే సాధనాన్ని 'అప్లికేటర్ ' యాక్వసస్ ఐడిన్ 12:500 ద్రావకంలోగాని, 75 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాలులొగాని, శావలాన్ సల్యూషన్‌లోగాని ఉంచాలి అలా ఉంచడంతో లూప్‌కి, అప్లికేటర్‌కి అంటుకుని ఉన్న వ్యాధిక్రిములు పూర్తిగా నిర్మూలింపబడతాయి.

కాపర్-టి లూప్‌గాని, మల్టీలోడ్ సి యు 250 లూప్‌గాని క్రిముల నుంచి పూర్తి రక్షణ ఉన్న ప్యాక్‌లో భద్రపరచి ఉండటం జరుగుతుంది కనుక వాటిని వేయడానికి ముందు వేరే శుభ్రపరచవలసిన అవసరం లేదు.

గర్భాశయంలోకి లిప్పీస్‌లూప్‌ని వేయడంఎలా?

లూప్‌ని వేయించుకునే ముందు ఆ స్త్రీ పూర్తిగా మూత్రవిసర్జన చేసి ఉండాలి లూప్ వేయడానికి వీలుగా బల్లమీద వెల్లకిలా పడుకుని కాళ్ళు రెండూ మోకాళ్ళ దగ్గర ముడుచుకుని ఎత్తిపెట్టి ఉంచాలి. లూప్ వేసే ముందు