పుట:KutunbaniyantranaPaddathulu.djvu/50

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 50

హెల్త్ వర్కరుగాని, వైద్యుడుగాని శుభ్రమైన గ్లవ్స్‌తో మర్మావయాల లోపల క్షుణ్ణంగా పరీక్ష చేయాలి. గర్భిణీ లేదని, గర్భాశయానికి గడ్దలుగాని, పుళ్ళుగాని లేవని నిర్ధారణ చేసుకోవాలి.

అటు పిమ్మట లూప్ వేయడానికి వలసెల్లంతో గర్భాశయకంఠాన్ని 'సెర్విక్స్ ' పట్టుకొని కాస్త ముందుకు లాగాలి. ఆ తర్వాత యుటిరైన్ సౌండుతో గర్భాశయం ఎంత పరిమాణంలో ఉందో కొలత చూడాలి.

తరువాత అప్లి కేటర్ లొకి లూప్‌ని దూర్చి ఆ అప్లికేటర్‌ని గర్భాశయ కంఠం ద్వారా గర్భాశయంలోకి ప్రవేశపెట్టాలి. తరువాత అప్లికేటర్‌లో ఉన్న లూప్‌ని గర్భాశయంలోకి నెట్టాలి. ఆ తరువాత అప్లి కేటర్ లో ఉన్న లూప్ ని గర్బాశయం లోకి నెట్టాలి. ఆ తరువాత అప్లికేటర్ ని తీసివేయాలి. అప్లి కేటర్‌ని తీసివేసిన తరువాత లూప్‌కి కట్టబడిన నైలాన్ దారాలు యోని లోపల వ్రేలాడుతూ కనబడతాయి. ఈ దారాలు మరీ పొడవు ఉంటే రెండు-మూడు సెంటీమీటర్ల పొడవు ఉంచి తక్కిన పొడవుని కత్తిరించి వేయాలి.

లూప్ వేసిన తరువాత 15-20 నిముషాలు విశ్రాంతి తీసుకొవాలి. లూప్ వేయడానికి ఎటువంటి మత్తు ఇవ్వనవసరంలేదు. అతిగా భయపడి ఎంతో నెర్వస్‌గా ఉండే వాళ్ళకి కొందరికి పూర్తి మత్తు ఇచ్చి లూప్ వేయవలసి వస్తుంది.

లూప్ వేయడానికి అప్లి కేటరు గర్భాశాయ కంఠం