ఈ పుట ఆమోదించబడ్డది
కుటుంబ నియంత్రణ - పద్ధతులు 48
కాపర్-టి లూప్‌ల్లో కొన్నింటికి 200 లేదా 220 లేదా 250 స్క్వేర్ మిల్లీ మీటర్ల రాగి తీగ చుట్టబడి ఉంటుంది. లూప్ తోక భాగాన్న, అనగా దిగువ భాగాన్ని రెండు కొసలుగా నైలాన్ దారం ముడి వేసె ఉంటుంది.
లూప్‌లని భద్రపరచడం ఎలా ?
లూప్‌లని రోగక్రిముల నుంచి రక్షణ కలిగించి, పరిశుభ్రమైన రీతిలో గర్భాశయంలో ప్రవేశ పెట్టవలసి ఉంది.
లిప్పీస్ లూప్‌నిగాని, దానిని గర్భాశయంలోకి ప్రవేశపెట్టే సాధనాన్ని గాని క్రిముల నిర్మూలనకొరకు వేడినీళ్ళల్లో మరిగించడం, వేడిగా ఉండే ఆటోక్లేవ్‌లోగాని ఉంచడం చేయకూడదు. అలా చేయడం వల్ల అవి పాడైపోతాయి.