Jump to content

పుట:KutunbaniyantranaPaddathulu.djvu/35

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 35

సాధారణంగా 21 ప్యాకెట్టు బిళ్ళలు వాడే స్త్రీలు ఆ ప్యాకెట్టు పూర్తి అవగానె ఆపివేస్తారు. అవి ఆపివేసిన్ 3-4 రొజుల్లో బహిష్టు వస్తుంది. తిరిగి బహిష్టు వచ్చిన తరువాత 5 వ రోజునుంచి క్రొత్త ప్యాకెట్టు ప్ర్రారంభిస్తారు. కాని 28 బిళ్ళల ప్యాకెట్టులే కావాలనుకునే స్త్రీలు మొట్టమొదటివారి 5వ రోజునుంచి తెల్ల బిళ్ళల దగ్గరనుంచి మొత్తం 21 బిళ్ళలు పూర్తి చేసి తరువాత చాక్లెటు రంగులో ఉండే మిగతా 7 బిళ్ళలు వేసుకుంటారు. ఈ బిళ్ళలు కూడా రోజుకి ఒకటి చొప్పునే వాడాఅలి. ఈ 7 బిళ్ళ్లు పూర్తి అయిపోయేలోగా బహిష్టు రావడం, పూర్తి అవడం జరిగిపోతుంది. ప్యాకెట్టు అయిపొగానే తిరిగి 28 బిళ్ళల ప్యాకెట్టు తీసుకుని అందులో మళ్ళీ తెల్లబిళ్ళల దగ్గర నుంచి వేసుకోవడం మొదలుపెట్టాలి.

నోటిమాత్రలు ఎంత కాలం వాడవచ్చు ?

నోటి మాత్రలు వరసగా 3 నుంచి 5 సంవత్సరాలు వాడవచ్చు. ఇంతకంటే ఎక్కువకాలం కూడా వాడవచ్చు. అయితే కొన్ని చెడు ఫలితాలు కనబడే అవకాశం ఉంది. అందుకని డాక్టరు సలహా లేనిదే మూడు సంవత్సరాలకి మించి వాడటం మంచిది కాదు.

నోటి మాత్రలు వాడే స్త్రీలు ప్రతి 6 నెలలకి ఒకసారి వైధ్యునిచేత రక్తపొటు చూపించుకోవడం, రక్తంలో సుగర్