పుట:KutunbaniyantranaPaddathulu.djvu/34

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 34

8. మోనోవలార్
        21 బిళ్ళల ప్యాకెట్టు, 28 బిళ్ళల ప్యకెట్టు

9. ఓప్యులిన్ - 30
      21 బిళ్ళల ప్యాకెట్టు

10. ఆర్ధోనోవిన్ 21 బిళ్ళల ప్యాకెట్టు

11. నారాసైక్లిన్ 22 బిళ్ళల ప్యాకెట్టు

12. లిండియాల్ 22 బిళ్ళల ప్యాకెట్టు

13. ట్రైక్విలర్ 21 బిళ్ళల ప్యాకెట్టు

పైన ఇచ్చిన నోటిమాత్రల లిస్టు మార్కెట్టులొ లభించే అనేకంలో కొన్ని మాత్రమే వీటి 21 బిళ్ళల పాకెట్టుగాని, 22 బిళ్ళల ప్యాకెట్టుగాని బహిష్టు స్రావం కనబడిన 5 వ రోజునుంచి ప్రతి రోజూ రాత్రిపూట ఒకటి చొపున వాడాలి.

8 బిళ్ళల ప్యాకెట్టులు తయారు చేయడంలో ఒక కారణం ఉంది. కొందరికి రోజూ వేసుకుంటే తప్ప మానివేసిన తరువాత తిరిగి 5వ రోజున వేసుకోవాలని గుర్తు రాదు. అందుకని అటువంటి స్త్రీలకి ఇక ఎప్పటికీ మానకుండా సంవత్సరాల తరబడి రోజూ వేసుకునేందుకు 28 బిళ్ళల ప్యాకెట్తులు తయారుచేయబడ్డాయి. ఈ 28 బిళ్ళల ప్యకెట్టులో మొదట 21 బిళ్ళలే ఈస్ట్రోజన్, ప్రొజస్టరన్ హార్మోన్లకి సంబంధించినవి. మిగతా 7 బిళ్ళలు కేవలం ఐరన్ లెదా లాక్టొజ్ బిళ్ళలు.