పుట:KutunbaniyantranaPaddathulu.djvu/36

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 36

శాతం ఎంత ఉన్నదీ పరీక్ష చేయించుకోవడం మంచిది. అంతేకాకుండా డాక్టరుచేత పి. వి (గర్భకోశం, ఇతర జన నేంద్రియాల పరీక్ష) చేయించుకోవడం మంచిది.

నెలకి ఒకటిరెండుసార్లే కలసినా నోటిమాత్రలు నెలంతా వాడాలా?

కొందరు దంపతులు ఉద్యోగరీత్యా దూరంగా ఉండి నెలలో రెండు మూడు రోజులే దాంపత్య సంబంధాలలొ పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అటువంటివాళ్ళు అయినా నోటి మాత్రలు రోజూ వాడి తీరవలసిందే. అంతేకాని దాంపత్య సంబంధాలలో పాల్గొన్నప్పుడే నోటి మాత్రలు వాడితే సరిపొతుందని అనుకుంటే పొరబాటే అవుతుంది. రోజూ వాడకుండా కేవలం దాంపత్య సంబంధాలలో పాల్గొన్న రోజునే నోటిమాత్రలు వాడడంవల్ల గర్బం రాకుండా ఆగడం జరగదు.

నోటిమాత్ర మిస్‌కొట్టితే....

నోటి మాత్ర రోజూ రాత్రి భోజనం అవగానే వేసుకోవడం మంచిది. అంతేగాని బెడ్ రూం లోకి వెళ్ళిన తరువాత వేసుకుందామంటే ఆ రోజుకే మిస్ కొట్టే ప్రమాదం ఉంది. ఒకవేల ఒకరోజు మరచిపోతే ఉదయం లేవగానే ఆ విషయం గుర్తు తెచ్చుకుని టిఫెన్‌తో రాత్రి మాత్రని వేసుకోవాలి. తిరిగి ఆ రోజు రాత్రి మామూలుగానే వేసుకో