పుట:KutunbaniyantranaPaddathulu.djvu/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కుటుంబ నియంత్రణ - పద్ధతులు 204

వాంతులతో బాధపడిపోవడము జరుగుతుంది. అందుకని బాధాకరమైన ఇటువంటి పద్దతులను అవలంబించడము ప్రమాదకరము. అంతకంటే తేలికగా డి అండ్ సి వంటి చిన్నఆపరేషను ద్వారా అబార్షను చేయించుకోవచ్చు. ఇంతవరకు మనకు అందుబాటులో గర్భము పోవడానికి సరైన మందులులేవు. ప్రోస్టాగ్లాన్డిన్స్ అనే మందు వైద్య పరిశోధనల్లో వుంది. ఇది సరియైన ఫలితాలు ఇస్తుందని వైద్యప్రయోగాల్లో నిర్ధారణ అయిన తరువాత అందరికీ అందుబాటులోకి రాగలదు. ఈనాడు చాలామంది ఏవో బిళ్ళలు వేసుకుంటే గర్భము పోతుందని భావించే కేసుల్లో పరిశీలించి చూస్తే వారికి అసలు గర్భము రావడము అనేది జరిగి వుండదు. చాలామందికి గర్భము రావడము జరగకుండానే బహిస్టులు రాకుండా ఆగిపోతాయి. బహిస్టు రానంత మాత్రాన గర్భము వచ్చినట్లు కాదు. ఇట్లాంటి కేసుల్లో డూయోగైనాన్ వంటి బిళ్ళలు రోజుకి ఒకటి చొప్పున రెండు రోజులు వేసుకుంటే వారం పదిరోజుల్లో మామూలు బహిస్టు స్రావము కనబడుతుంది. నిజంగా గర్భమువస్తే ఈబిళ్ళలవల్ల గర్భము పోవడము జరగనే జరగదు. కాని ఈ విషయము తెలియక ఏ ఇతర కారణాలవల్ల బహిస్టు ఆగిపోయినా ఈ బిళ్ళలు వేసుకోవడముతో గర్భము పోయిందని భావిస్తూ వుంటారు.

* * *